పెళ్లి వార్త‌ల‌పై ర‌కుల్ మ‌ద‌ర్ షాకింగ్ రిప్లై!

పెళ్లి వార్త‌ల‌పై ర‌కుల్ మ‌ద‌ర్ షాకింగ్ రిప్లై!
పెళ్లి వార్త‌ల‌పై ర‌కుల్ మ‌ద‌ర్ షాకింగ్ రిప్లై!

ర‌కుల్ ప్రీత్‌సింగ్‌పై ఈ మ‌ధ్య రోజుకో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. లాక్‌డౌన్ కొన‌సాగుతున్న వేళ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌ద్యానికి ఓకే చెప్ప‌డంతో మ‌ద్యం షాపుల ముందు మందు బాబులు బారులు తీరిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలోనే ర‌కుల్‌కు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ర‌కుల్ మ‌ద్యం కొంటోందంటూ పుకార్లు షికారు చేశాయి.

మెడిక‌ల్ షాపులో మెడిన్స్ తీసుకుని వెళుతున్న ర‌కుల్ మ‌ద్యం తీసుకుని వెళుతోందంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేశారు. తాజాగా ఆమె పెళ్లిపై కూడా అదే స్థాయిలో పుకార్లు షికారు చేయ‌డం మొద‌లైంది. దీనిపై ఆమె త‌ల్లి  రిప్లై ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ర‌కుల్ ప్ర‌స్తుతం వ‌రుస భారీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీ వుంద‌ని, ఇప్ప‌ట్లో త‌న‌కు వివాహం చేసే ఆలోచ‌న లేద‌ని, త‌న చేతిలో వున్న ప్రాజెక్ట్‌లు పూర్త‌య్యాక అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తామ‌ని వెల్ల‌డించ‌డం ఆస‌క్తి క‌రంగా మారింది.

ర‌కుల్ ప్రీత్‌సింగ్ ప్ర‌స్తుతం త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్న `ఇండియన్ 2`, శివ‌కార్తికేయ‌న్ న‌టిస్తున్న `అయ‌లాన్‌`, తెలుగులో నితిన్ – చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రాల్లో న‌‌టిస్తోంది. ఇవే కాకుండా హిందీలో మ‌రో మూడు చిత్రాలు సెట్స్‌పై వున్నాయి.