ఐటెం సాంగ్స్ సై అంటున్న రకుల్ ప్రీత్


Rakul preet singh ready to dance in item songs
Rakul preet singh

ఐటెం సాంగ్స్ చేయడంలో తప్పులేదు , గ్లామర్ గా కనిపించడానికి ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు అలాంటిది నేనెందుకు ఐటెం సాంగ్  చేయను కాకపోతే నాకు ఆ అవకాశం రాలేదు వస్తే తప్పకుండా చేస్తాను అంటూ ఐటెం సాంగ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్ . తాజాగా కన్నడ చిత్రం కేజిఎఫ్ లో యష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్ చేసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది .

అయితే ఆ ఐటెం సాంగ్ లో ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ కే అవకాశం వచ్చిందని కానీ రకుల్ అందుకు ఒప్పుకోలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన రకుల్ ఐటెం సాంగ్స్ కు నేను రెడీ . వెండితెరపై అందాల ఆరబోతకు సిద్ధం అంటూ ప్రకటించింది . దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలన్న చందంగా గ్లామర్ గా ఉన్నప్పుడే అందాల విందు చేయాలనీ గట్టిగా సంపాదించుకోవాలని డిసైడ్ అయినట్లుంది అందుకే ఇలా ఐటెం కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది .

English Title: Rakul preet singh ready to dance in item songs

SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4