అన్నాదమ్ములతో రొమాన్స్ చేస్తున్న భామ


Rakul preet singh romance with star brothers
Rakul preet singh, Surya and Karthi

అన్నాదమ్ములతో ఏక కాలంలో రొమాన్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది హాట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ . టాలీవుడ్ లో ఓ ఊపు ఊపేసిన భామ రకుల్ . అయితే తాజాగా టాలీవుడ్ కంటే కోలీవుడ్ బెటర్ అని అంటోంది ఎందుకంటే టాలీవుడ్ లో ఈ భామ కు అంతగా ఛాన్స్ లు లేవు కానీ తమిళంలో మాత్రం నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి . అందులో రెండు సినిమాలు ఏక కాలంలో అది కూడా ఇద్దరు అన్నాదమ్ముల సినిమాల్లో నటించడం విశేషం .

ఇంతకీ ఎవరా ఇద్దరు అన్నాదమ్ములు అంటే తమిళ స్టార్ హీరోలు సూర్య , కార్తీ లు . సూర్య తో ఎన్ జీకే చిత్రంలో నటిస్తోంది రకుల్ , అలాగే కార్తీ తో దేవ్ చిత్రంలో నటిస్తోంది . ఈ రెండు చిత్రాలు కూడా దాదాపుగా షూటింగ్ ని పూర్తిచేసుకున్నాయి . దేవ్ చిత్రాన్ని ఫిబ్రవరి లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక కేజిఎన్ 2019 జనవరి నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ రెండు సినిమాల్లో ఇద్దరు అన్నాదమ్ములతో రొమాన్స్ చేయడం విశేషం .

 

English Title: Rakul preet singh romance with star brothers