లిక్క‌ర్ వీడియోపై ర‌కుల్ పంచ్ అదిరింది!



లిక్క‌ర్ వీడియోపై ర‌కుల్ పంచ్ అదిరింది!
లిక్క‌ర్ వీడియోపై ర‌కుల్ పంచ్ అదిరింది!

దేశం మొత్తం క‌రోనాతో అల్లాడుతున్న వేళ‌ ఖ‌జానా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లిక్క‌ర్‌కి అనుమ‌తులిచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ఎక్క‌డ చూసినా కిలోమీట‌ర్ల‌మేర క్యూలైన్‌లు క‌నిపిస్తూ ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. లేడీస్ కూడా మ‌గ‌వాళ్ల‌తో స‌మానంగా క్యూ లైన్‌లో నిల‌బ‌డి మ‌ద్యం కొంటున్న దృశ్యాలు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

ఇదిలా వుంటే హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఓ షాప్ నుంచి బ‌య‌టికి వ‌స్తూ చేతుల్లో చిన్న‌ చిన్న బాటిల్స్‌తో క‌నిపించ‌డంతో దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో అంతా ర‌కుల్ మ‌ద్యం షాపు నుంచి మ‌ద్యం కొనుగోలు చేసి వెళుతోందంటూ ప్ర‌చారం చేయ‌డం మొద‌లుపెట్టారు. అయితే ర‌కుల్ మెడిక‌ల్ షాప్‌ల నుంచి బ‌య‌టికి వ‌స్తున్న దృశ్యాలు క‌నిపించ‌డంతో అంతా నాలుక్క‌రుచుకుంటున్నారు.

ఈ వీడియోపై తాజాగా ర‌కుల్ ప్రీత్‌సింగ్ స్పందించింది. ఓ.. వావ్ మెడిక‌ల్ షాపుల్లోనూ మ‌ద్యం అమ్ముతార‌ని త‌న‌కు తెలియ‌ద‌ని త‌న‌పై వైర‌ల్ అవుతున్న వీడియోపై సెటైరిక‌ల్‌గా స్పందించింది. ర‌కుల్ ప్ర‌స్తుతం `ఇండియ‌న్ 2` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.