ర‌కుల్ వెడ్డింగ్ ప్లాన్స్ య‌మ క్రేజీ!


ర‌కుల్ వెడ్డింగ్ ప్లాన్స్ య‌మ క్రేజీ!
ర‌కుల్ వెడ్డింగ్ ప్లాన్స్ య‌మ క్రేజీ!

క‌రోనా కార‌ణంగా లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. అయితే టాలీవుడ్‌లో మాత్రం లాక్‌డౌన్ వ‌రుస పెళ్లిళ్ల‌కు మంచి ముహూర్తంగా మారింది. మునుపు ఎన్న‌డూ లేని విధంగా టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సంద‌డి మొద‌లైంది. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు రెండ‌వ పెళ్లితో టాలీవుడ్‌లో వివాహాల హంగామా మొద‌లైంది. రానా, నితిన్, నిఖిల్, కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. తాజాగా మెగా డాట‌ర్ నిహారిక‌ల వివాహాలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇన్ని పెళ్లిళ్లు చూసిన త‌రువాత స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్‌కి పెళ్లిపై గాలి మళ్లిన‌ట్టుంది.

వ‌రుస పెళ్లిళ్లు చూసిన ర‌కుల్ త‌న వెడ్డింగ్ పై త‌న‌కున్న క్రేజీ ప్లాన్స్‌ని బ‌య‌ట‌పెట్టింది. ప్ర‌ముఖ వెడ్డింగ్ మ్యాగ‌జైన్‌కిచ్చిన ప్ర‌త్యేక ఇండ‌ర్య్వూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. వివాహ వ్య‌వ‌స్థ‌పై త‌న‌కు ఎంతో గౌర‌వం వుంద‌ని చెప్పిన ర‌కుల్ త‌న‌కు కకాబోయే జీవిత భాగ‌స్వామి అన్ని విష‌యాల్లోనూ ప‌ర్‌ఫెక్ట్‌గా వుండాల‌ని చెప్పింది. జీవితంలో ఓ ల‌క్ష్యం కోసం త‌పించి శ్ర‌మించే వ్య‌క్తిని పెళ్లాడాల‌ని ర‌కుల్‌కు వుంద‌ట‌.

ఇక వెడ్డింగ్ ప్లాన్స్ గురించి య‌మ క్రేజీగా వెల్ల‌డించింది ర‌కుల్‌. త‌న‌కు అట్ట‌హాసంగా పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేద‌ని చెప్పిన ర‌కుల్ పెళ్లిని మాత్రం బీచ్ లో చేసుకోవాల‌ని వుంద‌ని క్రేజీగా చెప్పేసి షాకిచ్చింది. బీచ్‌లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకోవాల‌ని ర‌కుల్‌కు వుంద‌ట‌. ర‌కుల్ క్రేజీ ఆలోచ‌న విన్న వారంద‌రికి వింత‌గానూ విడ్డూరంగాను వుంద‌ట‌. ర‌కుల్‌ని బీచ్‌లో పెళ్లాడే వ‌రుడు ఎక్క‌డున్నాడో.. ఎప్పుడొప్తాడో చూడాలి మ‌రి.