వేశ్య పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్‌సింగ్‌?

వేశ్య పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్‌సింగ్‌?
వేశ్య పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్‌సింగ్‌?

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. అన‌తి కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ని సొంతం చేసుకున్న హీరోయిన్‌. `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌` చిత్రంతో టాలీవుడ్‌లో తొలి హిట్‌ని సొంతం చేసుకుంది ఆ త‌రువాత వ‌రుస‌గా రామ్‌తో పంగ‌డ చేస్తో, ర‌వితేజ‌తో `కిక్‌2`, రామ్‌చ‌ర‌ణ్‌తో బ్రూస్‌లీ, ధృవ‌, ఎన్టీఆర్‌తో నాన్న‌కు ప్రేమ‌తో, అల్లు అర్జున్‌తో `స‌రైనోడు`, బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో `జ‌య జాన‌కి నాయ‌క‌`, మ‌హేష్‌తో `స్పైడ‌ర్‌` వంటి చిత్రాల్లో న‌టించి క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.

అయితే ఆ క్రేజ్ ఎంతో కాలం నిల‌బ‌డ‌లేదు. మ‌హేష్‌తో న‌టించిన `స్పైడ‌ర్‌` బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిల‌వ‌డంతో ర‌కుల్ క్రేజ్ భారీగా త‌గ్గిపోయింది. దీంతో బాలీవుడ్‌కు మ‌కాం మార్చింది ర‌కుల్‌. అక్క‌డ చేసిన `దేదే ప్యార్ దే` సూప‌ర్‌హిట్ కావ‌డంతో అక్క‌డి చిత్రాల్లో బిజీ కావాల‌నుకుంది. బాలీవుడ్‌లో ఎంత గ్లామ‌ర్‌గా, ఎంత బోల్డ్‌గా న‌టిస్తే అంత‌గా అవ‌కాశాలు త‌లుపుత‌డ‌తాయ‌న్న‌ది ఒంట‌బ‌ట్టించుకున్న ర‌కుల్ హ‌ద్దులు దాటి ఎక్స్‌పోజింగ్ చేయ‌డానికి కూడా సిద్ధ‌మైంది.

క‌మ‌ల్‌హాస‌న్‌తో శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న `ఇండియ‌న్ 2` చిత్రంలో న‌టిస్తోంది. తాజాగా వేశ్య పాత్ర‌లో న‌టించేందుకు ర‌కుల్ ప్రీత్‌సింగ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన ఓ పేరున్న వేశ్య బ‌యోపిక్‌లో ర‌కుల్ న‌టించ‌నుంద‌ని తెలిసింది. బోల్డ్ పాత్ర అయినా న‌ట‌న‌కు అవ‌కాశం వుండ‌టంతో వేశ్య పాత్ర‌లో న‌టించ‌డానికి ర‌కుల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు, ఈ చిత్రం హిందీలో తెర‌కెక్క‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.