పవన్ కోసం రకుల్ ని దించేస్తున్నారా?


పవన్ కోసం రకుల్ ని దించేస్తున్నారా?
పవన్ కోసం రకుల్ ని దించేస్తున్నారా?

రకుల్ ప్రీత్ సింగ్ .. టాలీవుడ్ లో రాకెట్ వేగంతో ఆఫర్లని సొంతం చేసుకున్న హీరోయిన్. ఆనతి కాలంలోనే వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాల్ని దక్కించుకుని పలువురిని ఆశ్చర్యపరిచింది. ఒకే సారి రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్లతో నటించి షాక్ ఇచ్చింది. అయితే  మహేష్ తో కలిసి నటించిన ‘స్పైడర్’ సినిమాతో డౌన్ ఫాల్ మొదలైంది.

ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’ లో నటిస్తోంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో రకుల్ వెబ్ సిరీస్ ని అంగీకరించిందంటూ వార్తలు షికారు చేయడం మొదలైంది. క్రిష్ కొత్త కథలు సిద్ధం చేస్తున్నారని, ఆయనే ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారని, ఇందులో రకుల్ నటించడానికి సై అందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రకుల్ ని క్రిష్ సెలెక్ట్ చేసుకుంది వెబ్ సిరీస్ కోసం కాదని అంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ ఓ పీరియాడిక్ ఫిల్మ్ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగనుంది.  సైలెంట్ రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం కోసం పవన్ కు  జోడీ గా రకుల్ ని క్రిష్ ఎంపిక చేసుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే డైరెక్టర్ క్రిష్ వెల్లడించేవరకు వేచిచూడాల్సిందే.