మంచు లక్ష్మిని ముద్దుపెట్టుకోవడంతో విమర్శలు


Rakul preet singh trolled brutally for posing with manchu lakshmi

మంచు లక్ష్మి ప్రసన్న ని కౌగిలించుకొని ముద్దులు పెట్టడంతో రకుల్ ప్రీత్ సింగ్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు . మంచు లక్ష్మితో రకుల్ కలిసి దిగిన ఫోటోలను ట్వీట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్ దాంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు . మంచు లక్ష్మి – రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు పైగా ఇద్దరు కూడా మహిళలు దాంతో మరింత స్నేహంగా ఉంది రకుల్ అయితే ఇద్దరు మహిళలు అయి ఉండి కౌగిలించు కోవడం ఏంటి ? ముద్దులు పెట్టుకోవడం ఏంటి ? వాటిని ఇలా సోషల్ మీడియాలో పెట్టడం ఏంటి ? అని రకుల్ ట్రోల్ చేస్తున్నారు .

తెలుగులో నిన్న మొన్నటి వరకు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్ అయితే మహేష్ బాబు సరసన నటించిన స్పైడర్ చిత్రం తర్వాత ఒక్కసారిగా రకుల్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది . తెలుగులో పెద్దగా చాన్స్ లు లేకుండా పోయాయి కాకపోతే తమిళంలో మాత్రం నటిస్తోంది . తెలుగులో బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి లా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తోంది రకుల్ ప్రీత్ సింగ్ . ఈ సినిమా తప్ప తెలుగులో మరో చాన్స్ లేదు ఈ భామకు . అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా జిమ్ బిజినెస్ స్టార్ట్ చేసింది రకుల్ .

English Title: Rakul preet singh trolled brutally for posing with manchu lakshmi