రకుల్ ఆశలను గల్లంతు చేసారు


rakul preet singh unhappy,rakul unhappy bollywood film,rakul preet latest news,rakul preet singhబాలీవుడ్ మీద ఆశలతో రెచ్చిపోయి అందాలను తెరమీద ఆరబోయడమే కాకుండా ప్రచార కార్యక్రమాల్లో సైతం అందాలను ఆరబోసి పిచ్చ షాక్ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్ . అయితే హిందీలో నటించిన ” అయ్యారే ” చిత్రం మొన్న రిలీజ్ అయ్యింది కానీ ఆ సినిమా అంతగా ప్రభావం చూపించడం లేదు . రివ్యూలు కూడా పాజిటివ్ గా రాలేదు అలాగే ఓపెనింగ్స్ కూడా అనుకున్న రేంజ్ లో లేవు దాంతో రకుల్ ఆశలు గల్లంతయ్యాయి .

తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది రకుల్ అయితే తెలుగు సినిమాలను పక్కన పెట్టి బాలీవుడ్ లో జెండా పాతుదామని వెళ్ళింది కానీ అమ్మడి ఆశలు ఆవిరయ్యాయి అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే అజయ్ దేవ్ గన్ చిత్రం లో నటించే ఆఫర్ ఉంది కానీ రకుల్ ఆశలు కాస్త సజీవంగానే ఉన్నాయి ఆ సినిమా హిట్ అయితే రకుల్ లక్కీ లేదంటే మళ్ళీ దక్షిణాది చిత్రాలు అందునా తెలుగు చిత్రాలే గతి ఈ భామకు .