రకుల్ కోరిక రౌడీ తీరుస్తాడా?రకుల్ కోరిక రౌడీ తీరుస్తాడా?
రకుల్ కోరిక రౌడీ తీరుస్తాడా?

రకుల్ ప్రీత్ సింగ్…దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించేసింది. ఒక్క ప్రభాస్ తో తప్ప. అంతే కాకుండా నాగార్జున వంటి సీనియర్ హీరో సరసన కూడా నటించింది రకుల్. ఈ మధ్య తెలుగులో సెలెక్టివ్ గా ఉంటోన్న రకుల్ బాలీవుడ్ అవకాశాలు కోసం ఎదురుచూస్తోంది. అయితే తెలుగు సినిమాలను కూడా వదలనంటోంది రకుల్.

అయితే దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించేసిన రకుల్ కు యంగ్ హీరో విజయ్ దేవరకొండతో నటించాలన్న కోరిక ఉందిట. అర్జున్ రెడ్డి చూసిన తర్వాత విజయ్ కు ఫ్యాన్ అయ్యాయని, అవకాశమొస్తే తన సరసన నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. లక్ష్మి మంచుతో టాక్ షో ఫీట్ అప్ విత్ ది స్టార్స్ లో రకుల్ ఈ వ్యాఖ్యలు చేసింది.

అంతే కాకుండా తాను ప్రస్తుతం సింగిల్ అని, తన ఊహలకు తగ్గ అబ్బాయి వస్తే రిలేషన్ షిప్ లోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నానని అంటోంది. ఆ అబ్బాయి మినిమం 6 ఫీట్ ఉండాలని, హానెస్టీ ఉండాలని, తనను అర్ధం చేసుకోవాలని ఆశపడుతోంది. తను హీరోయిన్ అవ్వడం వల్ల తనకు ప్రపోజల్స్ చాలా వచ్చి ఉంటాయని అందరూ భ్రమ పడుతుంటారు, అయితే అంత సీన్ లేదని అంటోంది. ఇదంతా బానే ఉంది కానీ రకుల్ కోరికను విజయ్ తీరుస్తాడా?