ఢిల్లీ హైకోర్టుని ఆశ్ర‌యించిన ర‌కుల్‌!

ఢిల్లీ హైకోర్టుని ఆశ్ర‌యించిన ర‌కుల్‌!
ఢిల్లీ హైకోర్టుని ఆశ్ర‌యించిన ర‌కుల్‌!

స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్ర‌యించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మాద‌క ద్ర‌వ్యాల కేసుకి సంబంధించి మీడియాలో త‌న‌పై వ‌స్తున్న క‌థ‌నాలు నిలిపివేయాల‌ని పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఆ వార్త‌ల్ని మీడియాలో ప్ర‌చారం చేయ‌కుండా స‌మాచార శాఖ ఆదేశాలు ఇవ్వాల‌ని పేర్కొన్నారు. జ‌స్టీస్ చావ్లా ధ‌ర్మాస‌నం ర‌కుల్ పిటీష‌న్‌ని విచార‌ణ‌కు స్వీక‌రించారు.

మీడియాలో ప్ర‌సారాల‌పై సుప్రీమ్ కోర్టు కూడా స్పందించింద‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. మీడియా సంస్థ‌లు స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని ఈ సంద‌ర్భంగా ఢిల్లీ హైకోర్టు సూచించింది. పిటీష‌న్‌ని ఫిర్యాదుగా ప‌రిగ‌ణించి ఆయా శాఖ‌లు చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని సూచించింది. ఈ మేర‌కు సమాచార ప్ర‌సార శాఖ ప్ర‌సార భార‌తి, ఎన్‌బీఏ, ప్రెస్ కౌన్సిల్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసును పోలీసులు డ్ర‌గ్స్ కోణంలోనూ విచారిస్తున్న నేప‌థ్యంలో రియా ప‌లువురి పేర్ల‌తో పాటు ర‌కుల్, పారాల పేర్ల‌ని బ‌య‌ట పెట్టింద‌ని ఇటీవ‌ల ఎన్‌సీబీ అధికారులు వెల‌క‌ల‌డించారు.

ఈ క్ర‌మంలో ర‌కుల్‌పై ప్ర‌సార మాధ్య‌మాల్లో వ‌రుస క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. సోష‌ల్ మీడియాలోనూ పెద్ద ఎత్తుగా ప్ర‌చారం జ‌రిగింది. కొంత మంది ర‌కుల్ ని ట్రోల్ చేయ‌డం కూడా జ‌రిగింది. దీంతో కొన్ని రోజులుగా మౌనంగా వున్న ర‌కుల్ తాజాగా మీడియాని అదుపు చేయండి అంటూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్ర‌యించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.