వికారాబాద్ అడ‌వుల్లో ర‌కుల్ ఏం చేస్తోంది!

వికారాబాద్ అడ‌వుల్లో ర‌కుల్ ఏం చేస్తోంది!
వికారాబాద్ అడ‌వుల్లో ర‌కుల్ ఏం చేస్తోంది!

సుశాంత్ ల‌వ‌ర్ రియా చ‌క్ర‌వ‌ర్తి డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ కావ‌డంతో ప‌లువురు సినీ సెల‌బ్రిటీల పేర్లు బ‌య‌టికి వ‌చ్చాయంటూ అందులో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ర‌కుల్ పేరు కూడా వుందంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించిన వియం తెలిసిందే. జాతీయ మీడియాలో ఈ అంశంపై సంచ‌ల‌న క‌థ‌నాలు ప్ర‌సారం అయ్యాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టుని ర‌కుల్ ఆశ్ర‌యించ‌డం, త‌న‌పై మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్ని ఆపండంటూ ర‌కుల్ కోర్టుకు విన్న వించ‌డం తెలిసిందే.

ఇదిలా వుంటే ర‌కుల్ వికారాబాద్ అడ‌వుల్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అమె అక్క‌డ ఏం చేస్తోంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎల్లో క‌ల‌ర్ లెహెంగాలో బ్లాక్ క‌ల‌ర్ చున్నీ ధ‌రించి అచ్చ తెలుగు ప‌ల్లెటూరి అమ్మాయిగా ర‌కుల్ క‌నిపిస్తున్న ఫొటోలు నెట్టింట్లో సంద‌డి చేస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. ద‌ర్శ‌కుడు క్రిష్ `కొండ పొలం` అనే న‌వ‌ల ఆధారంగా ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇందులో హీరోగా సాయిధ‌ర‌మ్‌తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ వికారాబాద్ అడ‌వుల్లో మొద‌లైంది. క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆపేశార‌ని ప్ర‌చారం జ‌రిగినా టీమ్ మాత్రం సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతోంది. ఇందులో ర‌కుల్ ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌బోతోంది. ఇందుకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల్ని వికారాబాద్ అడ‌వుల్లో షూట్ చేస్తున్నారు. ప్లెటూరి యువ‌తిగా లంగా ఓణీలో ర‌కుల్ క‌నిపిస్తున్న పిక్స్ బ‌య‌టికి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఇవి నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.