ఆ వార్త విని షాక్‌కు గుర‌య్యా: ర‌కుల్‌

ఆ వార్త విని షాక్‌కు గుర‌య్యా: ర‌కుల్‌
ఆ వార్త విని షాక్‌కు గుర‌య్యా: ర‌కుల్‌

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్న క్రేజీ ఫిల్మ్ `ఇండియ‌న్ 2`. శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లిరాజా సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 1996లో వ‌చ్చిన `భార‌తీయుడు` చిత్రానికి కొన‌సాగింపుగా ఈ సినిమా రూపొందుతోంది. కీల‌క పాత్ర‌ల్లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, సిద్ధార్ధ్, బాబీసింహా న‌టిస్తున్నారు. భార‌తీయ వ్య‌వ‌స్థ‌ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న రాజ‌కీయ ప్ర‌క్షాళ‌న నేప‌థ్యంలో శంక‌ర్ ఓ సెటైరిక‌ల్ చిత్రంగా రూపొందిస్తున్నారు.

చెన్నైలోని బిన్నీ మిల్స్‌లో గ‌త కొన్ని రోజులుగా షూటింగ్ జ‌రుగుతోంది. బుధ‌వారం రాత్రి క‌మ‌ల్‌హాస‌న్ పాల్గోన‌గా ప‌లు కీల‌క స‌న్నివేశాల్ని శంక‌ర్ చిత్రీక‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో సెట్‌లో వున్న క్రేన్ అదుపుత‌ప్పి చిత్ర టెక్నీషియ‌న్ టీమ్‌పై కూల‌డంతో ముగ్గురు మ‌ర‌ణించ‌డం కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లాన్ని రేపుతోంది. దీనిపై లైకా ప్రొడ‌క్ష‌న్స్ తీవ్రంగా స్పందించింది. ముగ్గురు శ్ర‌మించే వ్య‌క్తుల్ని కోల్పోయామ‌ని, మా బాధ‌ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేమ‌ని పేర్కొంది.

క‌మ‌ల్‌, కాజ‌ల్‌, కార్తీక్ సుబ్బ‌రాజ్ కూడా స్పందించారు. తాజాగా ఈ చిత్రంలో న‌టిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ సోస‌ల్ మీడియా వేదిక‌గా త‌న బాధ‌ను వ్య‌క్తం చేసింది. త‌ను న‌టిస్తున్న `ఇండియ‌న్ 2` మూవీ సెట్‌లో జ‌రిగిన ప్ర‌మాదక‌ర వార్త గురించి తెలిసి షాక్‌కు గుర‌య్యాన‌ని. వారి లోటును ఎలా భ‌ర్తీ చేస్తారో అర్థం కావ‌డం లేద‌ని ర‌కుల్ స్పందించింది.

Credit: Twitter