ట్రోలర్స్‌కు స్మార్ట్ రిప్లై ఇచ్చిన రకుల్!

ట్రోలర్స్‌కు స్మార్ట్ రిప్లై ఇచ్చిన రకుల్!
ట్రోలర్స్‌కు స్మార్ట్ రిప్లై ఇచ్చిన రకుల్!

తాము న‌టించే సినిమా కోసం న‌టీన‌టులు ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డుతుంటారన్న‌ది తెలిసిందే. కొంద‌రు స్లిమ్‌గా మారుతుంటారు. మ‌రి కొంత మంది బొద్దుగా సిద్ధ‌మ‌వుతుంటారు. ర‌కుల్ ప్రీత్‌సింగ్ కూడా బాలీవుడ్ మూవీ `దే దే ప్యార్ దే` సినిమా కోసం దాదాపు 8 కేజీలు త‌గ్గి స్లిమ్‌గా మారింది. అయితే అప్ప‌ట్లో ఆమె రూపాన్ని చూసి కొంత మంది నెటిజ‌న్స్ ట్రోల్ చేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలోట్రోలర్స్‌కి స్పార్ట్‌గా రిప్లై ఇచ్చి షాకిచ్చింది. `దేదే ప్యాన‌ర్ దే`  చిత్రంలో అజయ్ దేవ్‌గన్,  టబు వంటి తారలతో క‌లిసి న‌టించాను. ఆ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌ద్దిని గ‌ట్టిగా నిర్ణ‌యించుకుని ఎలాగైనా ఈ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌ద్ద‌ని ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లాను. కేవలం 40 రోజుల్లో 8 కిలోలు తగ్గాను అని తెలిపింది.

`నేను చాలా స్లిమ్ అయ్యానని చాలా మంది ఆశ్చర్యపోయారు. తెలుగులో ఇక నాకు సినిమాలు రావ‌డం క‌ష్ట‌మే` అని కామెంట్ చేశారు. అయితే నేను ఆ కామెంట్స్‌ని సీరియ‌స్‌గా తీసుకోలేదు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తున్నాను` అని తెలిపింది. ర‌కుల్ ప్ర‌స్తుతం క్రిష్ తెర‌కెక్కిస్తున్న చిత్రంతో పాటు నితిన్ హీరోగా న‌టిస్తున్న `చెక్‌`లో న‌టిస్తోంది. బాలీవుడ్లో మేడే` చిత్రంలో న‌టిస్తోంది.