త్రోబ్యాక్ పిక్‌తో మంట‌ పెట్టేస్తోంది!

త్రోబ్యాక్ పిక్‌తో మంట‌పెట్టేస్తోంది!
త్రోబ్యాక్ పిక్‌తో మంట‌పెట్టేస్తోంది!

నిత్యం మండే ఎండ‌ల‌తో మండిపోతున్న వేళ త‌న ఫొటోల‌తో మ‌రింత హీట్‌ని పెంచేస్తోంది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. జీన్స్ ష‌ర్ట్ ధ‌రించి బ‌ట‌న్స్ వ‌దిలేసి డెనిమ్ ష‌ర్ట్‌లో హొయ‌లొలికిస్తున్న ఓ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే ఈ ఫొటో ఇప్ప‌టిది కాద‌ని పాత ఫొటో అని దాన్ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నార‌ని తెలిసింది.

ర‌కుల్‌ని సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న వారి సంఖ్య ఎక్కువే. 13 మిలియ‌న్ నెటిజ‌న్స్ ర‌కుల్‌ని ఫాలో అవుతున్నారు. ఇక ట్విట్ట‌ర్‌లో మాత్రం 4 మిలియ‌న్‌ల మందే ఫాలోవ‌ర్స్ వున్నారు. ఈ త‌ర‌హా ఫొటోల‌తో ర‌కుల్ నిత్యం త‌న ఫ్యాన్స్‌కి ఐ ట్రీట్ ఇచ్చేస్తోంది. దీంతో ఆమెని ఫాలో అయ్యేవారి సంక్ష రోజు రోజుకీ పెరుగుతోంది.

తెలుగులో ఫామ్ కోల్పోతున్న ర‌కుల్ ప్ర‌స్తుతం నితిన్ హీరోగా చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి తెర‌కెక్కిస్తున్న చిత్రంలో న‌టిస్తోంది. దీనికి `చెక్‌` అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారు. దీనితో పాటు త‌మిళంలో `ఇండియ‌న్ 2`లో న‌టిస్తోంది. క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా శంక‌ర్ ఈ చిత్రాన్నితెర‌కెక్కిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ై సుభాస్క‌ర‌న్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

View this post on Instagram

 

Colour is everything, black and white is more ?

A post shared by Rakul Singh (@rakulpreet) on