రకుల్ మూవీ… అక్కడ తుస్సుమంది!

రకుల్ మూవీ... అక్కడ తుస్సుమంది!
రకుల్ మూవీ… అక్కడ తుస్సుమంది!

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ పరంగా ఇప్పుడు అంత ఆశాజనకంగా లేదు. ఆమె సినిమాలు ఇటీవలే ఫట్టుమన్నవే ఎక్కువ. ఇదిలా ఉంటే రకుల్ కు అవకాశాలకు మాత్రం కొదవలేదు. తనవైపు వచ్చిన అవకాశాలను మాత్రం కాదనుకోవడం లేదు. హిందీలో ఆమె నాలుగు సినిమాలు చేసింది. అందులో మొదటిది సర్దార్ కా గ్రాండ్ సన్ ఓటిటిలో విడుదలైంది.

ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. మొదటి రివ్యూల ప్రకారం ఈ సినిమా అంత గొప్పగా ఏం లేదట. అర్జున్ కపూర్ కు ప్లాప్ కన్ఫర్మ్ అంటున్నారు. అలాగే రకుల్ ప్రీత్ కు ఈ సినిమా ఏ రకంగానూ ఉపయోగపడదట. అందులోనూ ఈ చిత్రంలో చాలా చిన్న రోల్ చేసింది.

స్టార్టింగ్ లో కాసేపు, ఎండింగ్ లో కాసేపు వచ్చి వెళ్లిపోయే పాత్ర ఆమెది. మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.  దర్శకత్వంలో ఒక సినిమా చేసిన విషయం తెల్సిందే.