రకుల్ కు అంత కోపమెందుకొచ్చింది?Rakul Preet Singh
రకుల్ కు అంత కోపమెందుకొచ్చింది?

నిన్న తారల సందడి మధ్య ఘనంగా సినీ మహోత్సవం జరిగిన విషయం తెల్సిందే. పూజ హెగ్డే, రాశి ఖన్నా, దేవి శ్రీ ప్రసాద్ వంటి వారు తమ పెర్ఫార్మన్స్ తో ఈవెంట్ కు మరింత సందడిని తీసుకొచ్చారు. అయితే వీళ్ళతో పాటు మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా తన పెర్ఫార్మన్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే అమ్మడికి వచ్చిన కోపం కారణంగా ఈవెంట్ మధ్యలోనుండే వెళ్ళిపోయింది.

ఇంత పెద్ద ఈవెంట్ లో మధ్యలోంచి వచ్చేసే అంత ఏం జరిగింది అనుకుంటున్నారా? ఏమీ లేదు.. ఈవెంట్ అంటే తారల స్పీచ్ లు కచ్చితంగా ఉండేవే. కాకపోతే ఈ ఈవెంట్ లో చిరంజీవి, కృష్ణం రాజు, ఎస్వీ కృష్ణారెడ్డి చిన్నజీయర్ స్వామి, అల్లు అరవింద్ వంటి హేమాహేమీలు కొలువై ఉన్న వేళ స్పీచ్ లకు కాస్త ఎక్కువ సమయమే పట్టింది. దీంతో అసహనానికి గురైన రకుల్ అక్కడినుండి నిర్వాహకులకు కూడా చెప్పకుండా వచ్చేసిందిట. మరీ అంత కోపమైతే ఎలా రకుల్?