నటుడు రాళ్ళపల్లి కన్నుమూత


Rallapalli Venkata Narasimha Rao
Rallapalli Venkata Narasimha Rao

సీనియర్ నటుడు రాళ్ళపల్లి ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో కన్నుమూశారు . 73 ఏళ్ల రాళ్ళపల్లి పూర్తి పేరు రాళ్ళపల్లి వెంకట నరసింహారావు . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాళ్ళపల్లి కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచాడు . మాక్స్ క్యూర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు . తెలుగులో పలు చిత్రాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా పలు పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు రాళ్ళపల్లి .

దాదాపు 850 సినిమాల్లో నటించారు , రాళ్ళపల్లి కి ఇద్దరు అమ్మాయిలు కాగా అందులో ఒకరు ఇంతకుముందే చనిపోయింది . ఇక మరో అమ్మాయి అమెరికాలో ఉంది . దాంతో అమెరికాలో ఉన్న రాళ్ళపల్లి కూతురు వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు . రాళ్ళపల్లి మృతి తో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగింది .