రామ్ సినిమా బడ్జెట్ సమస్యతో ఆగిపోయిందట

ram and praveen sattaru film shelved with budget problemయంగ్ హీరో రామ్ ఇటీవలే ప్రవీణ్ సత్తారు తో ఒక సినిమా చేయడానికి అంగీకరించడమే కాకుండా ప్రారంభోత్సవం కూడా చేసిన విషయం తెలిసిందే . అయితే ప్రస్తుతం వినబడుతున్న కథనం ప్రకారం ఆ సినిమా ఆగిపోయిందని అంటున్నారు . అసలు రామ్ – ప్రవీణ్ సత్తారు ల కాంబినేషన్ లో సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా ……. … భారీ బడ్జెట్ అవుతుండటమే కారణమట ! మిలిటరీ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువ అవుతుండటం, అటు రామ్ కు కానీ ఇటు దర్శకుడు ప్రవీణ్ కు కానీ ఆ రేంజ్ లో మార్కెట్ లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ రిస్క్ అవుతుందని భావించి డ్రాప్ అయ్యాడట స్రవంతి రవికిశోర్ .

స్రవంతి మూవీస్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రవికిశోర్ మార్కెట్ విషయంలో బడ్జెట్ విషయంలో పక్కాగా ఉంటాడు . భారీ బడ్జెట్ తో సినిమా తీస్తే అది హిట్ కాకపోతే పెట్టిన మొత్తం పోవడం ఖాయం అందుకే ప్రాజెక్ట్ ఆపెయ్యడమే బెటర్ అని డిసైడ్ అయ్యాడట ! ఇక ఇప్పుడు మరో కథ ని రెడీ చేసే పనిలో పడ్డాడు ప్రవీణ్ సత్తారు . మరి రామ్ తో సెట్ అవుతుందా ? లేదంటే మరో స్టార్ హీరో కోసం వెళ్తాడా చూడాలి .ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గరుడవేగ సక్సెస్ అయినప్పటికీ పెద్దగా లాభాలు రాలేదు ఎందుకంటే బడ్జెట్ ఎక్కువయ్యింది .