రామ్ మ‌ళ్లీ చాక్లెట్ బాయ్ అయిపోయాడు!


రామ్ మ‌ళ్లీ చాక్లెట్ బాయ్ అయిపోయాడు!
రామ్ మ‌ళ్లీ చాక్లెట్ బాయ్ అయిపోయాడు!

టాలీవుడ్ హీరోల్లో ఎన‌ర్జిటిక్ హీరో రామ్ చాక్లెట్ బాయ్‌లా వుంటారు. తొలి సినిమా `దేవ‌దాసు` నుంచి రామ్‌ది అదే స్టైల్. అయితే ఆ స్టైల్‌ని వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మార్చారు. రామ్‌ని కూడా ఊర మాస్ పాత్ర‌లో చూపించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు. రామ్‌, పూరి జ‌గ‌న్నాథ్‌ల క‌ల‌యిక‌లో వచ్చిన మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంర్‌టైన‌ర్ `ఇస్మార్ట్ శంక‌ర్‌.

ఇందులో రామ్ ఊర నాటు మాస్ హీరోగా క‌నిపించి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలోని రామ్ గెట‌ప్ చూసి ఫ్యాన్స్‌తో పాటు ఇండ‌స్ట్రీ జ‌నాలు కూడా షాక‌య్యారు ఆ స్థాయిలో రామ్ మేకోవ‌ర్‌ని మార్చారు పూరి. ప్ర‌స్తుతం `రెడ్‌` చిత్రంలో న‌టిస్తున్న రామ్ తాజాగా ‌తన‌ ఒరిజిన‌ల్ లుక్ లోకి వ‌చ్చేశారు. త్వ‌ర‌లో ఆయ‌న ఓ కొత్త చిత్రానికి రెడ అవుతున్నారు. అది మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ కాదు రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ఱ్ అందుకే లుక్ మార్చారు.

రామ్ న‌టించిన తాజా చిత్రం `రెడ్‌`. కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించారు. స్ర‌వంతి మూవీస్ బ్్యాన‌ర్‌పై స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌మిళ హిట్ చిత్రం `త‌డ‌మ్‌` ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో  నివేదా పేతురాజ్‌, మాళ‌విక శ‌ర్మ హీరోయిన్‌లుగా న‌టించారు. హేబా ప‌టేల్ ఐట‌మ్ సాంగ్‌లో మెరిసింది. ఈ చిత్రాన్ని ఈ నెల 9నే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు కానీ క‌రోనా వైర‌స్ కార‌ణంగా వాయిదా వేశారు.

Credit: Twitter