చ‌ర‌ణ్ వికారాబాద్‌లో ఏం చేస్తున్నాడు?చ‌ర‌ణ్ వికారాబాద్‌లో ఏం చేస్తున్నాడు?
చ‌ర‌ణ్ వికారాబాద్‌లో ఏం చేస్తున్నాడు?

`బాహుబ‌లి` త‌రువాత జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిన్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. పాన్ ఇండియా స్థాయిలో భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంగా రాజ‌మౌళి రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్  హీరోలుగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ కొమ‌రం భీంగా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌బోతున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ `మోట‌ర్ సైకిల్ డైరీస్` స్ఫూర్తితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మితం అవుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

ఇటీవ‌ల వైజాగ్ ప‌రిస‌రాల్లోని అరకులో క్లైమాక్స్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ఎన్టీఆర్ పాల్గొన‌గా ప‌లు కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించార‌ట‌. ఎన్టీఆర్‌కు సంబంధించిన పార్ట్ పూర్తి కావ‌డంతో హీరో రామ్‌చ‌ర‌ణ్‌కు సంధించిన షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. వికారాబాద్‌లో జ‌రుగుతోంది. రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన‌గా వికారాబాద్ ఫారెస్ట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు.

ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మార్చి వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ పూర్తిచేసి చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేయాల‌ని ముందు నుంచే రాజ‌మౌళి చెబుతూ వ‌స్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల కోసం టైమ్‌ని కూడా షెడ్యూల్ చేసుకున్నార‌ని తెలుస్తోంది. `బాహుబ‌లి` త‌రువాత రాజ‌మౌళి నుంచి రాబోతున్న సినిమా కావ‌డంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో `ఆర్ ఆర్ ఆర్‌`ని సంథింగ్ స్పెష‌ల్‌గా తెర‌పైకి తీసుకొస్తున్నారు,