ఫస్ట్ లుక్ రేపే కానీ టీజర్ మాత్రం ……


Ram charan and boyapati' s movie first look and teaser date announced

రాంచరణ్బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు . అయితే ఇన్ని రోజులకు వాళ్ళ కోరిక నెరవేరబోతోంది . రేపే రాంచరణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది అయితే టీజర్ ని మాత్రం ఇప్పుడే రిలీజ్ చేయడం లేదు . ఈనెల 9న టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . దీపావళి పండగ సందర్భాన్ని పురస్కరించుకొని రేపు మధ్యాహ్నం ఒకటింటికి ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు . అలాగే 9వ తేదీన ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు టీజర్ ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఆ చిత్ర బృందం .

రాంచరణ్ సరసన మహేష్ భామ కియారా అద్వానీ నటిస్తుండగా స్నేహ , తమిళ హీరో ప్రశాంత్ , అల్లరి నరేష్ సోదరుడు మాజీ హీరో ఆర్యన్ రాజేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు . ఆర్యన్ రాజేష్ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు దాంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని చరణ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు . డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2019 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . బోయపాటి శ్రీను మాస్ దర్శకులు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి .

English Title : Ram charan and boyapati’ s movie first look and teaser date announced