చిరంజీవి, చరణ్ వరసగా రెండు సార్లు?


చిరంజీవి, చరణ్ వరసగా రెండు సార్లు?
చిరంజీవి, చరణ్ వరసగా రెండు సార్లు?

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఇప్పటికే మూడు సార్లు కలిసి నటించిన విషయం తెల్సిందే. ముందుగా మగధీర సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించాడు. దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత బ్రూస్ లీ లో చిరంజీవి మరోసారి కలిసి నటించాడు. ఆ పాత్రకు కూడా సూపర్బ్ ఫీల్ వచ్చింది. ఫ్యాన్స్ కు చిరంజీవి స్పెషల్ ఎంట్రీని చూసి పూనకాలే వచ్చాయి. అలాగే ఖైదీ నెం 150 సినిమాలో రామ్ చరణ్ ఒక పాటలో మెరిశాడు. చరణ్, చిరు కలిసి డ్యాన్స్ చేసింది ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ లా అనిపించింది.

ఇక కామియో కాకుండా ఈసారి చిరంజీవి ఆచార్యలో రామ్ చరణ్ 30 నిమిషాల పాటు కనపడేలా ఒక రోల్ ను డిజైన్ చేసాడు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కు భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్, చిరంజీవి కలిసి మరోసారి కనిపించబోతున్నారని తెలుస్తోంది. చిరంజీవి లూసిఫెర్ రీమేక్ ను చేయనున్న విషయం తెల్సిందే. ఇందులో చరణ్ స్పెషల్ రోల్ లో మరోసారి అలరించబోతున్నారని సమాచారం. మరి చూడాలి ఇందులో ఎంత వరకూ నిజముందో.