రామ్‌చ‌ర‌ణ్ కోసం ఆ హీయిన్ ఫిక్సా!

రామ్‌చ‌ర‌ణ్ కోసం ఆ హీయిన్ ఫిక్సా!
రామ్‌చ‌ర‌ణ్ కోసం ఆ హీయిన్ ఫిక్సా!

క‌న్న‌డ క‌స్తూరి రష్మిక మంద‌న్న టైమ్ మామూలుగా లేదు. ఏది చేసినా క‌లిసొస్తోంది. ఏ సినిమా చేసినా సూప‌ర్ హిట్ అవుతోంది. దాంతో ర‌ష్మిక టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది. ఆమెతో సినిమా చేయాల‌ని డైరెక్ట‌ర్‌లు చూస్తుంటే నిర్మాత‌లు మా సినిమాలో ర‌ష్మిక‌ని తీసుకుంటే సెంటిమెంట్ గా హిట్ అనే భావ‌న‌కు వ‌చ్చేశారు. ఇటీవ‌ల ర‌ష్మిక న‌టించిన‌ చిత్రాల‌న్నీ వ‌రుస‌గా సూప‌ర్‌హిట్‌లు అయ్యాయి.

ఇటీవ‌ల జ‌న‌వ‌రికి రిలీజైన `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఆ త‌రువాత నెల‌కూడా తిర‌క్కుండానే వ‌చ్చిన `భీష్మ‌` కూడా విజయం సాధించ‌డంతో నిర్మాత‌ల్లో ర‌ష్మ‌క‌తో సినిమా అంటే సూప‌ర్ హిట్ అనే సెంటిమెంట్ మొద‌లైంది. దాంతో ఆమెకు ఆఫ‌ర్లు ఇవ్వ‌డానికి స్టార్ హీరోల‌తో పాటు యంగ్ హీరోలు కూడా క్యూ క‌డుతున్నారు.

ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌, సుకుమార్‌ల క‌ల‌యిక‌లో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్న ర‌ష్మిక త‌మిళంలో కార్తి హీరోగా న‌టిస్తున్న `సుల్తాన్‌`లోనూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రష్మ‌కి న‌టిస్తున్న తొలి త‌మిళ చిత్ర‌మిది. తాజాగా ర‌ష్మిక‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ల‌భించిన‌ట్టు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ రూపొందిస్తున్న చిత్రం `ఆచార్య‌`. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇందులో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. చర‌ణ్‌కు జోడీగా ర‌ష్మిక‌ని చిత్ర బృందం అడిగిన‌ట్టు తెలిసింది. ఇది ఫైన‌ల్ అయితే ర‌ష్మిక కెరీర్ మ‌రో మ‌లుపు తిరిగిన‌ట్టే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.