దివ్యాంగుల కోసం చెర్రీ – ఉపాస‌న టాలెంట్ షో

దివ్యాంగుల కోసం చెర్రీ - ఉపాస‌న టాలెంట్ షో
దివ్యాంగుల కోసం చెర్రీ – ఉపాస‌న టాలెంట్ షో

క‌రోనా చాలా మంది జీవితాల్ని చిధ్రం చేసింది. కొంత మంది జీవితాల్లో క‌ల్లోలం సృష్టించింది. అయితే క‌రోనా సంక్షోభంలో నిరాశ‌కు గుర‌వుతున్న ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపేందుకు ఉపాస‌న‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి ఆన్‌లైన్ డ్యాన్స్ షోని ప్రారంభించ‌బోతున్నారు. వివ్యాంగులు త‌మ జీవితంలో ఎదురైన స‌వాళ్ల‌ని అధిగ‌మించి వారి క‌ల‌ల‌ను ఎలా సాకారం చేసుకున్నారో చూపించ‌బోతున్నారు.

దివ్యాంగుల్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు అడుగులు వేయాల‌ని, త‌ప‌స్ అనే కుర్రాడు పుట్టుక ఎలాంటి క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాడో ఈ సంద‌ర్భంగా ఉపాస‌న వివ‌రించారు. ప‌ట్టుద‌ల‌తో డ్యాన్స‌ర్‌గా, గాయ‌కుడిగా అనేక బ‌హుమ‌తులు గెలుచుకున్న‌ట్టు చెప్పుకొచ్చారు. ఈ షోలో రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు ప్ర‌భుదేవా, ఫ‌రాఖాన్ కూడా పాల్గొన‌బోతున్నారు. డ్యాన్స్ కేవ‌లం ఫ్యాష‌న్ కాద‌ని ఓ ఎమోష‌న్ అని బాలీవుడ్ ఫేమ‌స్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్ ఫ‌రాఖాన్ అన్నారు.

రా హృద‌యానికి ఎంత చేరువైన విష‌యం డ్యాన్స్‌. చిన్న‌ప్ప‌టి నుంచి మ్యూజిక్‌, డ్యాన్స్ న‌న్ను ఎంతో మందికి చరువ చేసింది. ఇప్పుడు ఎంతో ప్రత్యేక‌మైన డ్యాన్స్ షో గురించి ప్ర‌క‌టిస్తున్నా. దివ్యాంగులు ఈ డ్యాన్స్ షోలో పాల్గొనాల‌ని కోరుతున్నాం. ఇందు కోసం urlife.co.in ‌లో మీ పేర్లు న‌మోదు చేసుకోండి. ఈ మ‌ధ్య నేను కొన్ని అద్భుత‌మైన డ్యాన్స్ వీడియోలు చూశా. క‌రోనా లాంటి క‌ష్ట స‌మ‌యంలో ఆ డ్యాన్స్ వీడియోలు చూసి స్ఫూర్తి పొందా. చిన్న చిన్న సవాళ్ల‌ని ఎలా అధిగ‌మించాల‌న్న‌ది వారిని చూసి నేర్చుకున్నా` అన్నారు రామ్‌చ‌ర‌ణ్.