`డ్రైవింగ్ లైసెన్స్‌`కోసం క్రేజీ కాంబినేష‌న్‌!


`డ్రైవింగ్ లైసెన్స్‌`కోసం క్రేజీ కాంబినేష‌న్‌!
`డ్రైవింగ్ లైసెన్స్‌`కోసం క్రేజీ కాంబినేష‌న్‌!

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బాలీవుడ్‌, హ‌లీవుడ్ న‌టులు న‌టిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. ఇదిలా వుంటే తాజాగా మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ ఓ మ‌ల‌యాళ హిట్ సినిమా రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్న‌ట్టు తెలిసింది.

మ‌ళ‌యాళంలో పృథ్వారాజ్ సుకుమార‌న్ హీరోగా లాల్ జూనియ‌ర్ రూపొందించిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్ర క‌థ ఆక‌ట్టుకోవ‌డంతో వెంట‌నే తెలుగు రీమేక్ హ‌క్కుల్ని హీరో రామ్‌చ‌ర‌ణ్ సొంతం చేసుకున్న‌ట్టు తెలిసింది. `ఆర్ ఆర్ ఆర్` త‌రువాత ఎంటర్‌టైనర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని ప్లాన్ చేసుకుంటున్న రామ్‌చ‌ర‌ణ్ ఈ క‌థ‌ని అనిల్ రావిపూడి చేత రీమేక్ చేయించాలని భావిస్తున్నాడ‌ట‌.

ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి కొంత మార్పులు చేర్పులు చేసి హీరో వెంక‌టేష్‌తో క‌లిసి చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఇప్ప‌టికే అనిల్ రావిపూడికి స్క్రిప్ట్ మార్పులకు సంబంధించిన ప‌నులు అప్ప‌గించార‌ని. దీనికి సంబంధించిన అఫీషీయ‌ల్ న్యూస్ త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానుంద‌ని తెలిసింది.