బ్రిటీష్ అధికారిగా రామ్‌చ‌ర‌ణ్ ఏంటీ?


Ram charan as british police in RRR
Ram charan as british police in RRR

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. హాలీవుడ్ హిట్ చిత్రం మోట‌ర్ సైకిల్ డైరీస్ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ వ్య‌యంతో నిర్మిస్తున్నారు. ఈ శ‌తాబ్ద‌పు వండ‌ర్‌గా నిలిచిపోనున్న ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ ఆదివాసీ వీరుడు కొమ‌రం భీంగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

పాన్ ఇండియా లెవెల్లో తెర‌పైకొస్తున్న ఈ సినిమా కోసం కీల‌క సన్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. ఇప్ప‌టికే దాదాపు 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ చిత్ర తాజా షెడ్యూల్ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. ఈ షెడ్యూల్‌లో బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ పాల్గొంటున్నాడు. ఇటీవ‌ల ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్‌కి సంబంధించిన ఓ పిక్ బ‌య‌టికి రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. తాజాగా మ‌రో వార్త బ‌య‌టికి వ‌చ్చింది.

ఈ సినిమాలో అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్న రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ పోలీస్ అధికారిగా క‌నిపిస్తార‌ట‌. అదేంటి అల్లూరి బ్రిటీష్ పోలీస్ అధికారి ఏంటి? అన్న సందేహం చాలా మందిలో మొద‌లైంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం అజ‌య్‌దేవ్‌గ‌న్ బ్రిటీష్ అధికారిగా క‌నిపించ‌బోతున్నార‌ని, బ్రిటీష్ వారి ఎత్తులు తెలుసుకునే క్ర‌మంలో అల్లూరి సీతారామ‌రాజు బ్రిటీష్ పోలీస్ అధికారిగా వేషం మారుస్తాడ‌ని, ఆ క్ర‌మంలోనే ఈ స‌న్నివేశం వ‌స్తుంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.