రామ్‌చ‌ర‌ణ్ టాస్క్‌ని బాలీవుడ్‌కు షిప్ట్ చేశాడోచ్‌!రామ్‌చ‌ర‌ణ్ టాస్క్‌ని బాలీవుడ్‌కు షిప్ట్ చేశాడోచ్‌!
రామ్‌చ‌ర‌ణ్ టాస్క్‌ని బాలీవుడ్‌కు షిప్ట్ చేశాడోచ్‌!

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌స్ నుంచి స్టార్ హీరోల‌కు పాకిన బీ ద రియ‌ల్ మెన్ ఛాలెంజ్ తాజాగా బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. ఇక ర‌చ్చ రంబోలా అవ్వ‌డం గ్యారెంటీ. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ వంగ మొద‌లు పెట్టిన ఈ ఛాలెంజ్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సందీప్ రెడ్డి వంగ ఓ వీడియోని పోస్ట్ చేసి జ‌క్క‌న్న‌ను ఛ‌జ్ఞాలెంజ్ చేయ‌డంతో ర‌స ప‌ట్టుగా సాగుతోంది.

సందీప్ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన రాజ‌మౌళి ఈ ఛాలెంజ్‌ని పూర్తి చేసి రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, కీర‌వాణి, శోభు యార్ల‌గ‌డ్డ‌, సుకుమార్‌ల‌కు ఛాలెంజ్ విరిరారు. దీంతో ఇది చైన్ లింగ్‌గా మారి వైర‌ల్ అవుతోంది. జ‌క్క‌న్న ఛాలెంజ్‌కి స్పందించిన ఎన్టీఆర్ మంగ‌ళ‌వారం ఉద‌యం త‌న ఇంటి ఫ్లోర్‌ని శుభ్రం చేసి పాత్ర‌లు క‌డిగేసి క్లీన్ చేసి ఇంటి ప‌రిస‌రాల‌ని క్లీన్ చేశాడు. ఆ త‌రువాత టాలీవుడ్ పిల్ల‌ర్స్ అయినా న‌లుగురు సీనియ‌ర్ హీరోలు చిరు, బాల‌య్య‌, నాగ్‌, వెంకీల‌తో పాటు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు ఛాలెంజ్ విసిరాడు.

ఇదిలా వుంటే రాజ‌మౌళి గారు ఛాలెంజ్ కంప్లీట్‌. అంటూ ` ఇంట్లో పనులను చేయడంలో గర్వపడదాం! నిజమైన పురుషులుగా ఉండి, పని భారాన్ని పంచుకోవడం ద్వారా మహిళలకు సహాయం చేద్దాం. అని రామ్‌చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు. ఈ ఛాలెంజ్‌కి ర‌ణ్‌వీర్‌సింగ్‌ని, త్రివిక్ర‌మ్‌ని, రానా ద‌గ్గుబాటిని, శ‌ర్వానంద్‌ల‌కు ఛాలెంజ్ చేయ‌డంతో టాలీవుడ్ నుంచి ఈ ఛాలెంజ్ బాలీవుడ్‌కు విస్త‌రించ‌బోతోంది.

Credit: Twitter