`ఆచార్య‌`లో చెర్రీ ఎంట్రీ అద‌రిపోతుంద‌ట‌!Ram charan character entering interval bang in acharya
Ram charan character entering interval bang in acharya

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి ‌సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఇందులో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఎండోమెంట్ అధికారిగా చిరంజీవి న‌టిస్తున్న ఈ చిత్రంలో క‌థ‌ని మ‌లుపు తిప్పే కీల‌క పాత్ర ఒక‌టి వుంద‌ని, ఆ పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. 45 నిమిషాల పాటు స్టూడెంట్ ల‌డ‌ర్‌గా రామ్‌చ‌ర‌ణ్ పాత్ర వుంటుంద‌ని గ‌త కొంత కాలంగా వార్త‌లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ పాత్ర‌కు సంబంధించిన కీల‌క విష‌యం ఒక‌టి ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో రాడిక‌ల్ యూనియ‌న్ లీడ‌ర్‌గా చెర్రీ పాత్ర వుంటుంద‌ని, రెవెల్యూష‌న‌రీ లీడ‌ర్‌గా రామ్‌చ‌ర‌ణ్ పాత్ర శ‌క్తి వంతంగా వుంటుంద‌ని లేటెస్ట్ న్యూస్‌.

రామ్‌చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇందులో అదిరిపోతుంద‌ని, ఇంట‌ర్వెల్ స‌మ‌యంలో ఈ పాత్ర ఎంట్రీ ఇస్తుంద‌ని తెలిసింది. అంతే కాకుండా ఓ పాట‌లో మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి క‌నిపించ‌నున్నార‌ట‌. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాలంటే ఈ సినిమా టీమ్ అధికారికంగా వెల్ల‌డించాల్సిందే.