ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన చరణ్


Ram Charan clarifies again on RRR release date
Ram Charan clarifies again on RRR release date

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2019లో వినయ విధేయ రామ చిత్రం ద్వారా డిజాస్టర్ రిజల్ట్ సాధించినా కానీ 2020లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఉండడంతో బెంగ పెడక్కర్లేదు. రాజమౌళి సినిమా కావడంతో అది కచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకం అందరికీ ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్న సంగతి తెల్సిందే. ఇదే చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. తను కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను మొదట జులై 30 2020న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఆర్ ఆర్ ఆర్ మొత్తం 10 భాషల్లో విడుదలవుతోంది. అందులోనూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు చాలానే సమయం పడుతుంది. దాంతో చెప్పిన సమయానికి రిలీజ్ చేయడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనికి తోడు కొన్ని వారాల ముందు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో జులై 30న అని వేయకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.

రిలీజ్ డేట్ పై అలుముకున్న అనుమానాలు నిజమనే భావన ఏర్పడిపోయింది. కొంతమంది అయితే రిలీజ్ డేట్ 2021కి మారిపోయింది అని వార్తలు రాసేశారు. ఈ రూమర్లపై ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఎటువంటి స్పందన చేయకపోవడంతో అవి నిజమని ఇక ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఇటీవలే హ్యాపీ మొబైల్ స్టోర్ లాంచ్ కోసం విజయవాడ వెళ్లిన రామ్ చరణ్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, చెప్పినట్లుగానే కచ్చితంగా సినిమా జులై 30న వస్తుందని, రిలీజ్ 2021లో అన్న వార్తలు ఒట్టి రూమర్లేనని కొట్టిపారేశాడు.

ఈ నేపథ్యంలోనే మల్టీస్టారర్ లపై కూడా స్పందించాడు, ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చరణ్, తాను మల్టీస్టారర్ లకు ఎప్పుడూ సముఖమేనని, సరైన కథ దొరికితే ఎవరితోనైనా కలిసి నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.