ఆచార్యుడితో క‌లిసి సిద్ధా వ‌చ్చేశాడు!

Ram charan comrade look in acharya is out
Ram charan comrade look in acharya is out

మెగాప‌వర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ మెగా ఫ్యాన్స్‌కి
గూస్ బంప్స్ తెప్పించింది. గ‌త ఏడాది రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజున `భీమ్ ఫర్ రామ‌రాజు` అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన `ఆర్ ఆర్ ఆర్‌` మేక‌ర్స్ శుక్ర‌వారం రామ్‌చ‌ర‌ణ్ రామ‌రాజు మ‌హోగ్ర‌రూపం అంటూ అల్లూరి సీతారామరాజు ఫెరోషియ‌స్ లుక్‌ని విడుద‌ల చేసింది. దీంతో మెగా సంబ‌రాలు మ‌రింత స్కై హైకి చేరుకున్నాయి.

శ‌నివారం `ఆచార్య‌` టీమ్ వంతు వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం `ఆచార్య‌`. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇందులో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సిద్ధా గా కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ని చిత్ర బృందం ఈ రోజు విడుద‌ల చేసింది. `ఆచార్య‌తో క‌లిసి గ‌న్ను ప‌ట్టిన సిద్ధాగా రామ్‌చ‌ర‌ణ్‌ లుక్ ఆక‌ట్టుకుంటోంది. `మీ పక్కన నటించడం కేవలం ఒక కల నెరవేరడం కంటే ఎక్కువ నాన్నా` `ని రామ్‌చ‌ర‌ణ్ ట్వీట్ చేయ‌గా `ధ‌ర్మానికి ధైర్యం తోడైన వేళ‌` అంటూ కొర‌టాల ట్వీట్ చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్రీ లుక్‌ని మాత్ర‌మే రిలీజ్ చేసిన `ఆచార్య‌` మేక‌ర్స్ తాజాగా రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ కామ్రేడ్‌గా రెవెల్యూష‌న‌రీ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. చిరుతో క‌లిసి తొలిసారి రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రాన్ని మే 13న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు.