అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షం 9000 kmph సినిమాను తెరకెక్కించారు సంకల్ప్ రెడ్డి. తాజాగా విడుదలైన ఆడియో.. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. జ్ఞానశేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ లో క్రిష్ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
నటీనటులు:
వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల
సాంకేతిక విభాగం:
దర్శకుడు: సంకల్ప్ రెడ్డి
నిర్మాతలు: రాధాకృష్ణ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగర్లమూడి
నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ విఎస్ (బాబా)
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ సబ్బని, మోనిక నిగొత్రే సబ్బని
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
స్టంట్స్: టడోర్ లజరోవ్
సిజి: రాజీవ్ రాజశేఖరన్
పిఆర్ఓ: వంశీ శేఖర్