ట్విట్ట‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్ స‌రికొత్త రికార్డ్‌!


Ram Charan gains a record 1 Million Twitter followers
Ram Charan gains a record 1 Million Twitter followers

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చరణ్ రికార్డు 1 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్లను సంపాదించి సోష‌ల్ మీడియాలో స‌రికొత్త రికార్డుని సాధించారు.  రామ్ చరణ్ ఇటీవలే సోషల్ మీడియాలో చేరిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోగా అన్ బీటెబుల్ రికార్డ్స్‌ని క్రియేట్ చేశారు. తాజాగా ట్విట్ట‌ర్‌లో రికార్డు సాధించ‌డం విషేశం.

రామ్ చరణ్ కేవలం 233 రోజుల్లో ట్విట్టర్‌లో 1 మిలియన్ ఫాలోవర్లను పొందారు. రామ్ చరణ్ కంటే మరే ఇతర టాలీవుడ్ నటుడు 1 మిలియన్ ఫాలోవర్లను ఈ టైమ్ పీరియ‌డ్‌లో సాధించ‌లేక‌పోవ‌డం విశేషం. దీంతో ఇది స‌రి కొత్త రికార్డ్‌గా భావిస్తున్నారు. రామ్ చరణ్ గ‌త కొంత కాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. తన అభిమానులతో అనుచరులతో సన్నిహితంగా ఉండటానికి దాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాడు.

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ డెకేడ్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తున్నారు. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు గా క‌నిపించ‌బోతున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన రామ‌రాజు టీజర్ ఇప్ప‌టికీ ట్రెండింగ్‌లో వుంది.