ఆచార్య సెట్స్ వర్క్ చూసి ఇంప్రెస్ అయిన రామ్ చరణ్


ఆచార్య సెట్స్ వర్క్ చూసి ఇంప్రెస్ అయిన రామ్ చరణ్
ఆచార్య సెట్స్ వర్క్ చూసి ఇంప్రెస్ అయిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు ఆచార్య సెట్స్ కు వెళ్ళాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుత షెడ్యూల్ కోసం ఒక భారీ సెట్ ను నిర్మించారు. సురేష్ సెల్వరాజన్ ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.

కొరటాల శివ ఆచార్యకు దర్శకుడన్న విషయం తెల్సిందే. భరత్ అనే నేను చిత్రానికి కూడా సురేష్ పనిచేసాడు. అసెంబ్లీ సెట్ కు చాలా మంచి పేరొచ్చింది. ఇక ప్రస్తుత సురేష్ వర్క్ చూసి రామ్ చరణ్ ముగ్దుడైపోయాడు. ఎవరైనా చెబితే కానీ ఇది అసలు సెట్ లా లేదని ప్రశంసలు కురిపించాడు.

సురేష్ సెల్వరాజన్ కూడా ఈ విషయంలో సంతోషంగా ఉన్నాడు. మీరు ఎలాంటి సెట్ కావాలో నాకు చెప్పిన గూస్ బంప్స్ వచ్చాయి. మీ అభినందనలు నన్ను మరింత హార్డ్ వర్క్ చేసేలా ప్రేరేపిస్తున్నాయి అని సురేష్ ట్విట్టర్ లో తెలియజేసాడు.

ఆచార్య షూటింగ్ ను వచ్చే మార్చ్ కల్లా పూర్తి చేయాలనుకుంటున్నాడు కొరటాల శివ. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే.