రామ్ చరణ్ కూడా వెబ్ సిరీస్ అరంగేట్రం చేస్తున్నాడా?


రామ్ చరణ్ కూడా వెబ్ సిరీస్ అరంగేట్రం చేస్తున్నాడా?
రామ్ చరణ్ కూడా వెబ్ సిరీస్ అరంగేట్రం చేస్తున్నాడా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి గత కొంత కాలంగా రూమర్లు షికార్లు చేస్తున్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ తర్వాతి సినిమాకు దర్శకుడిగా ఎన్నో పేర్లు వినిపించాయి అయితే అవేవీ నిజాలు కావని తేలిపోయింది. అయితే ఈ రూమర్లకు క్లారిటీ దొరికింది కానీ లేటెస్ట్ గా రామ్ చరణ్ పై సరికొత్త రూమర్ పుట్టుకొచ్చింది.

ప్రస్తుతమంతా డిజిటల్ మంత్రం జపిస్తున్నారు. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు వెబ్ సిరీస్, డిజిటల్ మీడియా బాట పడుతున్నారు. రామ్ చరణ్ కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అవుతున్నట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై విభిన్నమైన కథలను, టాలెంటెడ్ రైటర్స్ ను ప్రోత్సహించడానికి రామ్ చరణ్ వెబ్ సిరీస్ లను నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ లు జరిగే పరిస్థితి లేకపోవడంతో ఈ గ్యాప్ లో వెబ్ సిరీస్ పనులను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇది పూర్తయ్యాక ఆచార్య సినిమాలో స్పెషల్ రోల్ కు కూడా కమిట్ అయ్యాడు రామ్ చరణ్.