ధనుష్ బ్లాక్ బస్టర్ పై మనసు పారేసుకున్న రామ్ చరణ్


ధనుష్ బ్లాక్ బస్టర్ పై మనసు పారేసుకున్న రామ్ చరణ్
ధనుష్ బ్లాక్ బస్టర్ పై మనసు పారేసుకున్న రామ్ చరణ్

2019 దసరా పండగ సందర్భంగా తమిళంలో ఒక సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా చూస్తుండగానే 100 కోట్ల మార్క్ సాధించింది. సినిమాకి ఇప్పుడు భారతదేశమంతటా బ్రహ్మరధం పడుతున్నారు. పలు సినిమా వర్గాలకి చెందిన ప్రముఖులు మాధ్యమాల్లో పోస్ట్స్ పెడుతూ సినిమా గురించి తెగ పొగిడేస్తున్నారు. ఆ తమిళ సినిమా పేరు ‘అసురన్’ ; హీరో గా నటించింది ‘ధనుష్ సర్జా’ ; దర్శకులు ‘వెట్రిమారన్’.

మన తెలుగు సినిమా సూపర్ స్టార్ ప్రిన్స్ ‘మహేష్ బాబు’ గారు సినిమా గురించి పొగుడ్తూ ఒక ట్వీట్ చేసారు. అలా మహేష్ బాబు గారు ట్వీట్ చేయడం వలన ధనుష్ అభిమానులు ఖుషి అయిపోయారు. బాలీవుడ్ నిర్మాత, దర్శకులు ‘కరణ్ జోహార్’ కూడా అసురన్ సినిమాని బాలీవుడ్ మొత్తం వినపడేలా ట్వీట్ చేసారు. ఇక పలు సినిమా పరిశ్రమల వారు కూడా సినిమాని, సినిమాలో ధనుష్ నటనకి బ్రహ్మరధం పడుతున్నారు. ఈ సినిమాతో ధనుష్ – వెట్రిమారన్ ఇద్దరికీ అవార్డులు దక్కడం ఖాయం అని అంటున్నారు. కేవలం తమిళ సినిమా వారికి మాత్రమే పరిమితం అయిన ‘అసురన్’ నేడు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది అంటే అది పలు ప్రముఖుల పొగడ్తల వలన జరిగింది అని అనుకుంటున్నారు.

అందులోనూ ధనుష్ – వెట్రిమారన్ కలయిక బంపర్ హిట్టు. ఇప్పటి వరకు వారిద్దరు 4 సినిమాలకి కలిసి పనిచేసారు. ఆ సినిమాలు అన్ని సూపర్ హిట్టు మోత మోగించాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. తెలుగులో కూడా పలువురు ప్రముఖులు అసురన్ సినిమా రైట్స్ కొనడానికి ట్రై చేస్తున్నారు. మెగా వారసుడు ‘రామ్ చరణ్’ గారి పేరు మొదట వినపడుతుంది. అవును అసురన్ సినిమాకి వస్తున్న ఆదరణ చూసి సినిమాని రామ్ చరణ్ గారు చూడటం జరిగింది. చూసిన వెంటనే కొణిదెల ప్రొడక్షన్ వారితో అసురన్ సినిమా తెలుగు రైట్స్ కొనాలి అని అన్నారంటా. ఇంకేం ఉంది అలా రామ్ చరణ్ గారు చెప్పడం వలన రీమేక్ రైట్స్ కొనడానికి సిద్ధం అయ్యారు పలువురు.

రామ్ చరణ్ గారికి సినిమా అంతలా నచ్చడానికి కారణం ఆయన నటించిన ‘రంగస్తలం’ సినిమా. అవును చేసిన కథలనే అటు తిప్పి ఇటు తిప్పి చేస్తున్న తరుణంలో రంగస్థలం సినిమా రామ్ చరణ్ గారి సినిమా భవిష్యత్తు ని మార్చేసింది. అసురన్ సినిమా కూడా రంగస్థలం సినిమా మాదిరి లా ఉండటం చూసిన రామ్ చరణ్ గారికి ఆ సినిమా రీమేక్ చేసి తెలుగులో రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో తన నటన కి సంబంధించిన షూటింగ్ అయిపోగానే వెంటనే అసురన్ సినిమా ని తెరెకెక్కించాలి అని అనుకుంటున్నారు.

అసురన్ సినిమా మొత్తం రా, ఇంటెన్స్ స్టోరీ. సినిమాలో ధనుష్ నటన పరంగా చూసుకుంటే గొప్పగా జీవించేసారు…..అందుకే రంగస్థలం సినిమా తర్వాత మళ్ళీ ఇలాంటి కథ ఒకటి చేస్తే రామ్ చరణ్ గారి కెరీర్ కూడా ఒక్కసారిగా పెరగటం ఖాయం అని మెగా అభిమానులు చాలా సంతోస్తిస్తున్నారు. ఈ సంవత్సరం రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ, తండ్రి మెగాస్టార్ ‘చిరంజీవి’ గారికి ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా విషయంలో తోడుగా ఉండి, సినిమాని భారీ వ్యయంతో నిర్మించి తండ్రికి పెద్ద విజయం అందించి చరిత్రలో నిలిచాడు.