రామ్‌చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్` లుక్ లీక‌య్యిందా?


రామ్‌చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్` లుక్ లీక‌య్యిందా?
రామ్‌చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్` లుక్ లీక‌య్యిందా?

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం వ‌రుస‌గా వార్త‌ల్లో నిలుస్తోంది. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా లీకుల కార‌ణంగా నిత్యం చ‌ర్చ‌నీయాశంగా మారుతోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా లీకులు ఆగ‌క‌పోవ‌డంతో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌ట‌. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ నిజాంపై తిరుగుబాటు బావుటాను ఎగుర‌వేసిన ఆదివాసీ యోధుడు కొమ‌రం భీంగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. ఇటీవ‌ల బాలీవుడ్ హీరోతో పాటు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ పాల్గొన‌గా ప‌లు కీల‌క ఘ‌ట్టాల్ని చిత్రీక‌రించారు. అయితే షూటింగ్ మొద‌లుపెట్టిన తొలి రోజు నుంచి ఈ చిత్రాన్ని లీకుల భ‌యం ప‌ట్టి పీడిస్తోంది. ఇటీవ‌ల ఎన్టీఆర్ టైగ‌ర్ ఫైట్‌కు సంబంధించిన స్టిల్ బ‌య‌టికి లీక్ కావ‌డం క‌ల‌క‌లం రేపింది. తాజాగా రామ్‌చ‌ర‌ణ్ కు సంబంధించిన ఓ ఫొటో బ‌య‌టికి రావ‌డం, అందులోనూ అలియాభ‌ట్ గెట‌ప్‌కు సంబంధించిన ఫొటో కూడా వుండ‌టం కలక‌లంగా మారింది.

సినిమాలోని ఓ స‌న్నివేశంలో రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ పోలీస్‌గా క‌నిపిస్తార‌ట‌. దానికి సంబంధించిన ఫొటోనే తాజాగా లీక్ కావ‌డంతో ఆ ఫొటో ప్ర‌స్తుతం ఇంట‌ర్‌నెట్‌లో వైర‌ల్‌గా మారింది. రామ్‌చ‌ర‌ణ్‌, అలియాభ‌ట్ వింటేజ్ లుక్‌లో వున్న ఫొటో కావ‌డంతో క‌థ రివీల్ అయ్యే ప్ర‌మాదం వుంద‌ని చిత్ర వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి.