మెగాహీరో న‌క్స‌లైట్ అవ‌తారం!


Ram charan naxalite in chiru 152
Ram charan naxalite in chiru 152

మెగాస్టార్ చిరంజీవి కోసం ఆయ‌న ముద్దుల త‌న‌యుడు మెగాప‌వ‌ర్‌స్టార్ న‌క్స‌లైట్‌గా మారిపోతున్నారు. `రంగ‌స్థ‌లం` చిత్రంలో సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నఆయ‌న‌  మ‌ళ్లీ అదే త‌ర‌హాలో ఆక‌ట్టుకోవ‌డానికి రెడీ అయిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి 152 చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్  హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్‌లోని కోకా పేట‌లో జ‌రుగుతోంది.

20 కోట్ల భారీ  వ్య‌యంతో కోకా పేట‌లో కాల‌నీ సెట్‌ని వేశారు. ఇక్క‌డే ఎక్కువ రోజులు షూటింగ్ చేస్తున్నారు. త్రిష క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా న‌టిస్తున్నారు. రెజీనా స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతున్న ఈ చిత్రాన్ని న‌క్స‌లిజ‌మ్ నేప‌థ్యంలో ప‌వ‌ర్‌ఫుల్ క‌థాంశంతో రూపొందిస్తున్నారు. అయితే ఇందులోని ఓ కీల‌క అతిథి పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో రామ్‌చ‌రణ్ న‌క్స‌లైట్‌గా క‌నిపిస్తార‌ని, ఆయ‌న పాత్ర పేరు సిద్ధార్థ అని తెలిసింది.

రామ్‌చ‌ర‌ణ్‌ది ఇందులో అతిథి పాత్రే అయినా సినిమాకు అత్యంత కీల‌క‌మ‌ని చెబుతున్నారు. దీని కోసం డేట్స్ కూడా కేటాయించార‌ట‌. సినిమాలో చ‌ర‌ణ్ పాత్ర నిడివి అర‌గంట మాత్ర‌మేన‌ని వినిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వ‌చ్చే పాత్ర అని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.