గోవాలో స్టార్ హీరో హంగామా


గోవాలో స్టార్ హీరో హంగామా
గోవాలో స్టార్ హీరో హంగామా

గోవాలో న్యూ ఇయర్ హంగామా మొద‌లైంది. 31 నైట్ స్టార్‌ల కోలాహ‌లంతో గోవా బీచ్‌ల‌న్నీ మారు మ్రోగ‌బోతున్నాయి. ఇప్ప‌టికే చాలా మంది స్టార్స్ న్యూ ఇయ‌ర్ వెకేష‌న్ కోసం గోవా వెళ్లిపోయారు. మ‌రి కొంత మంది గోవాతో పాటు దుబాయ్‌, బ్యాంకాక్‌, స్పెయిన్‌, ర‌ష్యాకు ప‌య‌న‌మ‌వుతున్నారు. ఇదిలా వుంటే మెగా హీరో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న్యూ ఇయ‌ర్ వేడుక‌ల కోసం గోవా వెళ్లిపోయారు. `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న ఆయ‌న కొంత షూటింగ్ గ్యాప్ దొర‌క‌డంతో న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం గోవా వెళ్లిపోయారు.

శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో ఈ రోజు ఉద‌యం రామ్‌చ‌ర‌ణ్ హంగామా చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. బ్లాక్ టీ ష‌ర్ట్‌, బ్లూ జీన్స్‌లో స‌డెన్‌గా శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన రామ్‌చ‌ర‌ణ్ కొంత సేపు త‌న సిబ్బందితో హ‌ల్‌చ‌ల్ చేశారు. ఇప్ప‌టికే ఉపాస‌న గోవాకు వెళ్లిపోవ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ 31 ఉద‌యం గోవాకు వెళ్లిపోయారు. ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో క‌లిసి అక్క‌డ న్యూ ఇయ‌ర్‌ని సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి ఇప్ప‌టికే ఏర్పాట్లు చేసుకున్నార‌ట‌.

గోవా నుంచి తిరిగి వ‌చ్చాక రామ్‌చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్‌` షూటింగ్‌లో పాల్గొంటార‌ట‌. రాజ‌మౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు జోడీగా అలియా భ‌ట్ న‌టిస్తున్నారు. కొమ‌రం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఆయ‌న‌కు జోడీగా హాలీవుడ్ న‌టి నటించ‌నుంది. డీవీవీ దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.