మెగాప‌వ‌ర్‌స్టార్ కొత్త ద‌ర్శ‌కుడికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారా?


మెగాప‌వ‌ర్‌స్టార్ కొత్త ద‌ర్శ‌కుడికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారా?
మెగాప‌వ‌ర్‌స్టార్ కొత్త ద‌ర్శ‌కుడికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారా?

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ నెక్స్ట్ మూవీపై గ‌త కొన్ని రోజులుగా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అయితే ముందున్న ప్రాజెక్ట్‌లు పూర్తి చేసిన త‌రువాతే నెక్స్ట్ మూవీ గురించి ఆలోచించాల‌ని హీరో రామ్‌చ‌ర‌ణ్ భావిస్తున్నార‌ట‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్న ఇష‌యం తెలిసిందే. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఆదివాసీ పోరాట యోధుడు కొమ‌రం భీంగా క‌నిపించ‌బోతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ దాదాపు 80 శాతం పూర్తయింది. మ‌రో 20 శాతం చిత్రీక‌రించాల్సి వుంది. క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. ఇటీవ‌ల బ్యాలెన్స్‌గా వున్న కీల‌క స‌న్నివేశాల్ని పూర్తి చేయాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేసినా వాతావ‌ర‌ణం, క‌రోనా స‌హ‌క‌రించ‌డం లేదు. దీంతో స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నార‌ట‌. ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఓ కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేయాల‌నుకుంటున్నార‌ని తెలిసింది.

స‌తీష్ అనే యువ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ చ్చ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ అత‌నికి ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇవ్వాల‌నుకుంటున్నార‌ట‌. ఈ చిత్రానికి `స‌భ‌కు న‌మ‌స్కారం` అనే టైటిల్‌ని అనుకుంటున్నార‌ని వినిపిస్తోంది. ఇంత‌కు ముందు ఈ క‌థ‌ని ద‌ర్శ‌కుడు స‌తీష్ హీరో అల్లు అర్జున్‌కి వినిపించార‌ట‌. అయితే `పుష్ప‌` వుండ‌టంతో ఈ క‌థ‌ని అల్లు అర్జున్ వ‌దులు కున్నాడ‌ట‌.