ఫ్యాన్స్‌కు షాకిస్తున్న‌ రామ్‌చ‌ర‌ణ్ !


ఫ్యాన్స్‌కు షాకిస్తున్న‌ రామ్‌చ‌ర‌ణ్ !
ఫ్యాన్స్‌కు షాకిస్తున్న‌ రామ్‌చ‌ర‌ణ్ !

జ‌క్క‌న్న డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ప‌రంగా, డిజిట‌ల్ రైట్స్ ప‌రంగా చ‌రిత్ర సృష్టించ‌బోతోంది. ఇదిలా వుంటే ఈ సినిమాలో న‌టిస్తున్న మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఓ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది.  స‌క్సెస్‌కే విలువిచ్చే ఈ ఇండ‌స్ట్రీలో ఆ ఫార్ములాని బ్రేక్ చేస్తూ వ‌రుస ఫ్లాపుల్లో వున్న ఓ ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి అవ‌కాశం ఇస్తున్నాడ‌ట‌.

ఈ నిర్ణ‌యం మెగా ఫ్యాన్స్‌ని షాక్‌కు గురిచేస్తోంది.  అక్కినేని ఫ్యామిలీకి `మ‌నం` వంటి మ‌ర‌పురాని చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. `మ‌నం` త‌రువాత ఆయ‌న చేసిన 24, హ‌ల్లో, నాని గ్యాంగ్ లీడ‌ర్ వ‌రుస‌గా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి ద‌ర్శ‌కుడికి మ‌రో సినిమా ఇవ్వాలంటే ఎవ‌రైనా ఆలోచిస్తారు. కానీ రామ్‌చ‌ర‌ణ్ మాత్రం `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత విక్ర‌మ్ కుమార్‌తో సినిమా చేయ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్‌కు  విక్ర‌మ్ కుమార్ ఓ లైన్ వినిపించార‌ట‌. క‌థ, క‌థ‌నం కొత్త‌గా వుండ‌టంతో అత‌నితో సినిమా చేయ‌డానికి రామ్‌చ‌ర‌ణ్ అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. విక్ర‌మ్ కుమార్ మంచి స్క్రీన్‌ప్లే మాస్ట‌ర్‌. ఆయ‌న చేసిన `13బి`, `మ‌నం` 24, చిత్రాలు ఇదే విష‌యాన్ని వెల్ల‌డించాయి. ఆ న‌మ్మ‌కంతోనే రామ్‌చ‌ర‌ణ్ తాజా చిత్రాన్ని అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్ర అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఏప్రిల్ చివ‌రి వారంలో రానున్న‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం.