యంగ్ టైగర్ పై ఈ రూమర్స్ ఏంటి!ntr introduction scene to be highlight of rrr
ntr introduction scene to be highlight of rrr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతటి ప్రతిభావంతుడైన నటుడో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సన్నివేశం ఎలాంటిదైనా దాన్ని రక్తి కట్టించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు ఎన్టీఆర్. అలాగే డ్యాన్స్ అంటే ఇక చెలరేగిపోతాడు. ఎన్టీఆర్ ఎంత మంచి నటుడన్నదానికి మనం తన కెరీర్ నుండి చాలానే ఉదాహరణలు తీసుకోవచ్చు. ఇటీవలే అరవింద సమేత చిత్రంతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను రాజమౌళి తెరకెక్కిస్తుండడంతో ఈ చిత్రంపై సాధారణంగానే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక చిత్ర షూటింగ్ మొదలయ్యే సమయంలో రాజమౌళి అండ్ కో ప్రెస్ మీట్ పెట్టి ఇదీ కథ, ఈ రకంగా తీయబోతున్నాం అని వెల్లడించడంతో సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు అటు చరణ్ అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం ఇటీవలే చిత్రీకరించారట. పరిచయ సన్నివేశాలంటే ముందుగా గుర్తొచ్చే దర్శకుడు రాజమౌళి. ఆ ఒక్క సన్నివేశం తోటే ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇచ్చేస్తాడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ లో కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు విడివిడిగా రెండు భారీ ఇంట్రడక్షన్ సీన్లు ప్లాన్ చేసాడట. ఈ రెండు సీన్స్ ఇరు వర్గాల ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందని చిత్ర యూనిట్ కు క్లోజ్ సోర్సెస్ తెలియజేశాయి. రాజమౌళి తెరకెక్కించిన ఎన్టీఆర్ సీన్ అయితే యంగ్ టైగర్ కెరీర్ లోనే ది బెస్ట్ గా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ ఈ సీన్ లో చేసిన పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్న వినిపిస్తోంది. తారక్ పెర్ఫార్మన్స్, డైలాగ్ మాడ్యులేషన్ ఇలా అన్ని ఫ్యాక్టర్లలోనూ ఎన్టీఆర్ కుమ్మేసాడని అంటున్నారు.

కథాబలం, సంభాషణల మెరుపులు కలిసి ఈ సీన్ బాగా వచ్చిందని, థియేటర్లో ఈ సీన్ కు గూస్ బంప్స్ రావడం గ్యారంటీ అంటున్నారు. మరి ఇంత హైప్ ఇచ్చిన ఈ సీన్ థియేటర్లో ఎలా ఉంటుందో అన్న ఆత్రుత అభిమానుల్లో కలుగుతోంది. ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేస్తామని రాజమౌళి షూటింగ్ కు ముందే ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ డేట్ ను ఎలాగైనా మిస్ అవ్వకూడదని టీమ్ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతోంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ అనుకున్న ప్రకారం జరగలేదని, అందుకని జులైలో విడుదల చేయడం అసాధ్యమని వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాది దసరాకి సినిమాను వాయిదా వేయడం ఖాయమని అన్నారు. కానీ రామ్ చరణ్ ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ ఆ వార్తల్లో వాస్తవం లేదని, అనుకున్న ప్రకారమే షూటింగ్ సాగుతోందని, రిలీజ్ డేట్ మిస్ అయ్యే ఛాన్సే లేదని క్లారిటీ ఇచ్చాడు.