మలయాళ రీమేక్ లపై మనసు పారేసుకుంటోన్న చరణ్


మలయాళ రీమేక్ లపై మనసు పారేసుకుంటోన్న చరణ్
మలయాళ రీమేక్ లపై మనసు పారేసుకుంటోన్న చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు చరణ్. మొదట మార్చ్ కే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వాల్సి ఉన్నా షూటింగ్ లో డిలే వల్ల ఇప్పుడు అక్టోబర్ దాకా చిత్రీకరణ కొనసాగుతోంది. అయితే ఒకవైపు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే చరణ్ మరోవైపు తన సంస్థ నిర్మాణ కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తోన్న విషయం తెల్సిందే.

మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ కోసం కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించాడు రామ్ చరణ్. అదే ప్రొడక్షన్ హౌస్ నుండి ఖైదీ నెం 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు వచ్చాయి. ఇక మూడో చిత్రంగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిపి కొరటాల శివ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ రెండు మలయాళ చిత్రాల రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సైరా విడుదల సమయంలోనే మలయాళ చిత్రం లూసిఫెర్ రీమేక్ ను కొనుక్కున్నాడు చరణ్. ఈ రీమేక్ ను చిరంజీవి హీరోగా చేయాలని భావించాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన స్క్రిప్ట్ ఛేంజ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మలయాళ రీమేక్ ను రామ్ చరణ్ కొనుగోలు చేశాడంటూ వస్తున్న వార్త హాట్ టాపిక్ గా మారింది. మలయాళంలో ఇటీవలే సూపర్ హిట్ గా నిలిచినా డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను చరణ్ కొనుక్కున్నాడట.

అయితే ఈ సినిమా అటు చరణ్ కు కానీ ఇటు చిరంజీవికి కానీ సూట్ అయ్యే కథ కాదు. టాప్ హీరోలు ఇందులో నటిస్తే పనవ్వదు. వెంకటేష్ కోసం అంటున్నారు కానీ అది కూడా జరక్కపోవచ్చు. వరుణ్ తేజ్ లేదా సాయి తేజ్ లకు ఈ సినిమా సెట్ అవుతుందన్న భావన ఉంది. మరి నిజంగానే ఈ రీమేక్ ను చరణ్ కొన్నాడా? కొంటే ఎవరితో రీమేక్ చెయ్యొచ్చు అన్నది చూడాలి.