కోవిడ్ నుంచి కోలుకున్న మెగా హీరో!


కోవిడ్ నుంచి కోలుకున్న మెగా హీరో!
కోవిడ్ నుంచి కోలుకున్న మెగా హీరో!

క‌రోనా వైర‌స్ ‌సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా వ‌ద‌ల‌డం లేదు. ఏదో ఒక చోట్ అజాగ్ర‌త్త‌గా వుంటే వెంట‌నే సోకేస్తోంది. గ‌త నెల 29న మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ త‌న‌కు క‌రోనా వైర‌స్ సోకిందంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్‌ని షేర్ చేసి షాకిచ్చిన విష‌యం తెలిసిందే. `నేను క‌రోనా బారిన ప‌డ్డాను. తాజాగా చేసిన టెస్టుల్లో క‌రోనా పాజిటివ్ అని తేలింది. అయితే క‌రోనాకి సంబంధించిన ల‌క్ష‌ణాలు అంటూ ఏమీ లేవ‌ని, ప్ర‌స్తుతం క్వారెంటైన్‌లో వున్నాన‌ని రామ్‌చ‌ర‌ణ్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

డిసెంబ‌ర్ 29న వెల్ల‌డించిన రామ్ చ‌ర‌ణ్ ఆ రోజు నుంచి త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి క్వారెంటైన్‌లో వుంటున్నారు. తాజాగా ఆయ‌న కోలుకున్నార‌ని, కోవిడ్ స‌మ‌స్య నుంచి తేరుకున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం జ‌రిపిన టెస్టుల్లో రామ్‌చ‌ర‌ణ్ కు నెగెటివ్ అని తేలింద‌ట‌. జ‌న‌వ‌రి 7 నుంచి రామ్‌చ‌ర‌ణ్ `ఆచార్య` షూట్‌లో పాల్గొనాల్సి వుంది. అయితే అనూహ్యంత త‌ను కోవిడ్ బారిన ప‌డ‌టంతో `ఆచార్య‌` షెడ్యూల్‌ని వాయిదా వేశారు.

కొర‌టాల శివ రూపొందిస్తున్న `ఆచార్య‌`లో రామ్‌చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించిన కీల‌క షెడ్యూల్లో రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన‌బోతున్నార‌ట‌. 30 రోజుల పాటు ఏక‌ధాటిగా రామ్‌చ‌ర‌ణ్‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని కొర‌టాల శివ తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇదే షెడ్యూల్‌లో మెగాస్టార్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌పై ఓ పాట‌ని కూడా చిత్రీక‌రించ‌బోతున్నార‌ని, ఈ పాట మెగా ఫ్యాన్స్‌కి ఓ ట్రీట్‌లా వుంటుంద‌ని చెబుతున్నారు.