శంక‌ర్ మూవీలో రామ్‌చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ ఇదేనా?

 Ram charan role in Shankar`s film on too diffarent
Ram charan role in Shankar`s film on too diffarent

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల క‌ల‌యిక‌లో ఓ భారీ చిత్రం తెర‌పైకి రానున్న విష‌యం తెలిసిందే. విచిత్రం ఏంటంటే ఇది రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న 15వ చిత్రం కాగా ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కు కూడా ఇది 15వ చిత్ర‌మే కావ‌డం విశేషం. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించ‌నున్న ఈ మూవీ ఈ బ్యాన‌ర్‌కు 50వ చిత్రం.

ఇదిలా వుంటే ఇందులో రామ్‌చ‌ర‌ణ్ పాత్ర మునుపెన్న‌డూ చూడ‌ని విధంగా చాలా కొత్త‌గా వుంటుంద‌ని, ఈ పాత్ర ద్వారా స‌మాజానికి స్ట్రాంగ్ మెసేజ్‌ని శంక‌ర్ అందించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందు కోసం ఓ అద్భుత‌మైన ప్లాట్‌ని శంక‌ర్ ఇప్ప‌టికే సిద్ధం చేశార‌ని, ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంద‌ని తెలిసింది. క‌మ‌ర్ష‌యల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌కి స‌మాజిక అంశాన్ని జోడించి తెర‌కెక్కించ‌డంతో శంక‌ర్ దిట్ట అన్న విష‌యం తెలిసిందే.

రామ్‌చ‌ర‌ణ్ చిత్రాన్ని కూడా అదే పంథాలో పాన్ ఇండియా తెవెల్లో తెర‌పైకి తీసుకురానున్నార‌ట‌. వ‌చ‌చే ఏడాది ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్టు తెలుస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` తో పాటు `ఆచార్య‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్త‌యితే గానీ రామ్‌చ‌ర‌ణ్ డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాకి డేట్స్ కేటాయించ‌గ‌ల‌డు. శంక‌ర్ కూడా ప్ర‌స్తుతం `ఇండియ‌న్ 2` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.