రామ్ చరణ్ అలా అంటే.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా మరి?


రామ్ చరణ్ అలా అంటే.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా మరి?
రామ్ చరణ్ అలా అంటే.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా మరి?

మెగాస్టార్ చిరంజీవికి కొరటాల శివ ఆచార్య సినిమా కథ చెప్పినప్పుడు తనను ఎక్కువ ఎగ్జైట్ చేసింది అందులో ఉండే స్పెషల్ పాత్ర. ఈ కథ గురించి చెప్పినప్పుడే ఇందులో రామ్ చరణ్ చేస్తాడని మాట ఇచ్చాడు చిరంజీవి. దాని తర్వాత కొన్ని నెలలకు ఆచార్య సినిమా షూటింగ్ మొదలైంది. ముందుగా రామ్ చరణ్ నటించాల్సిన సీన్స్ ను షూట్ చేసేద్దాం అనుకున్నారు. కాకపోతే చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో బిజీగా ఉంటాడు కాబట్టి లాస్ట్ షెడ్యూల్ కింద రామ్ చరణ్ ఎపిసోడ్ ను మార్చారు. అయితే ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సో చరణ్ ఆచార్యలో నటించడం కుదరదనే అనుకున్నారు అంతా.

దీంతో కొరటాల శివ కూడా తదుపరి ఆప్షన్స్ చూసుకుని తనతో రెండు సినిమాలు చేసిన మహేష్ అయితే ఎలా ఉంటుందన్న ప్రపోజల్ చిరు ముందు పెట్టాడు. మహేష్ ను అడిగితే తను కూడా ఓ ఎస్ అన్నాడు. అయితే మహేష్ చేస్తే భారీగా పారితోషికం చెల్లించాల్సి వస్తుందన్న కారణంతో రామ్ చరణ్ తోనే ఈ పాత్రను చేయించాలని డిసైడ్ అయ్యారు. జూన్ లేదా జులైలో ఈ పాత్ర షూటింగ్ చేయాలనుకున్నారు.

ఇదంతా బానే ఉంది కానీ ఇందులో రామ్ చరణ్ పాత్ర గురించి వచ్చిన లీక్ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఇందులో చరణ్ నక్సలైట్ గా కనిపిస్తాడన్న విషయం అందరికీ తెల్సిందే. అయితే షాక్ కు గురి చేసే వార్త ఏంటంటే 30 నిమిషాల నిడివి ఉండే పాత్ర చివర్లో చనిపోతుందిట. అయితే ఆ పాత్రకు ఒక లక్ష్యముంటుందని, చరణ్ పాత్ర చనిపోయాక ఆ లక్ష్యాన్ని చిరంజీవి తీసుకుని ముందుకెళ్తాడని అంటున్నారు.

ఇలా హీరో చనిపోవడం అనేది తెలుగు ప్రేక్షకులు అంతలా జీర్ణించుకోలేరు. డబల్ రోల్ ఉన్నప్పుడు ఒక పాత్ర చనిపోతే ఓకే కానీ అందులోనూ స్పెషల్ రోల్ చనిపోవడం అనేది ఎంతవరకూ రుచిస్తుందో చూడాలి.