డైనమిక్ రోల్ లో అలరించనున్న రామ్ చరణ్

డైనమిక్ రోల్ లో అలరించనున్న రామ్ చరణ్
డైనమిక్ రోల్ లో అలరించనున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు చరణ్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అలరించనున్నాడు. ఈ సినిమా తర్వాత ప్యాన్ ఇండియా హీరోగా మారిపోతాడు. అందుకే నెక్స్ట్ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేసుకున్నాడు.

సౌత్ ఇండియన్ టాప్ దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ పనిచేయనున్న విషయం తెల్సిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దిల్ రాజు కెరీర్ లో 50వ చిత్రం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

ఇక ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ రోల్ చాలా డైనమిక్ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలవ్వడానికి శంకర్ లీగల్ సమస్యలు కూడా అడ్డుగా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.