చరణ్ నెక్స్ట్ మూవీకి కథ రెడీ అయిపోయిందా?


చరణ్ నెక్స్ట్ మూవీకి కథ రెడీ అయిపోయిందా?
చరణ్ నెక్స్ట్ మూవీకి కథ రెడీ అయిపోయిందా?

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాడు. అటు నటుడిగా ఇటు నిర్మాతగా తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో చరణ్ రామరాజు పాత్రలో కనిపించనున్నాడు. చరణ్ పుట్టినరోజుకు విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆర్ ఆర్ ఆర్ చేస్తుండగానే తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తోన్న ఆచార్యలో స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడు చరణ్.

దాదాపు 30 నిమిషాల నిడివున్న పాత్రకు చరణ్ ను ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఆచార్యకు రామ్ చరణే నిర్మాత కావడం విశేషం. ఈ రెండు చిత్రాలను వీలైనంత త్వరలో పూర్తి చేసి తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా విషయంలో చాలానే ఊహాగానాలు ఉన్నాయి. దర్శకులుగా పలువురు పేర్లు పరిశీలనకు వచ్చాయి. అయితే వారిలోంచి దర్శకుడు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినా కథాంశం ఏమిటనేది ఇప్పుడు బయటకు వచ్చేసింది.

తన నెక్స్ట్ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఆస్తి కోసం ఒక పాప ప్రాణాలు తీయడానికి ప్రయత్నించే గ్యాంగ్ నుండి ఆ పాపను రక్షించే వ్యక్తిగా చరణ్ పాత్ర ఉండబోతోందిట. చూస్తుంటే చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాకు దగ్గరగా కథ పాయింట్ ఉంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.