“దీపాలు వెలిగించండి..!” అంటున్న అల్లూరి సీతారామరాజు

“దీపాలు వెలిగించండి..!” అంటున్న అల్లూరి సీతారామరాజు
“దీపాలు వెలిగించండి..!” అంటున్న అల్లూరి సీతారామరాజు

కరోనా వైరస్ భారతదేశంలో విస్తరించకుండా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ అత్యవసర శాఖలు,డాక్టర్లు,పారిశుద్ధ్య కార్మికులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పోలీసులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.గతంలో జనతా కర్ఫ్యూ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతాపూర్వకంగా కరతాళధ్వనులు చేయమని విజ్ఞప్తి చేసిన గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారు; తాజాగా భారత జాతిని ఉద్దేశించి మాట్లాడిన వీడియోలో భాగంగా వచ్చే ఆదివారం అనగా ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు.. తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆపివేసి దీపాలు, ప్రమిదలు, కొవ్వొత్తులు లేదా సెల్ఫోన్ టార్చ్ లైట్ లు వెలిగించి మన ఇంటి వద్దనే ఉండి కరోనా వైరస్ పై ఐకమత్యంగా పోరాటం చేస్తున్నామనే  సమైక్య భావనను కాంతి రూపంలో ప్రసరింపజేస్తూ స్ఫూర్తి పొందాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో జనతా కర్ఫ్యూను పాటించమని విజ్ఞప్తి చేసిన సినిమా తారలు అందరూ ఇప్పుడు కూడా గౌరవ ప్రధాని మాటను గౌరవించి ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ దీపాల నిలిపివేసి దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని పిలుపునిస్తున్నారు. తాజాగా వారిలో ప్రస్తుత నవ యువ అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ తేజ్ కూడా తాజాగా తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన సందేశంలో దీపాలు వెలిగించాలనిని ప్రధాని ఆదేశాలు పాటించమని విజ్ఞప్తి చేశారు.