హీరో రామ్‌చ‌ర‌ణ్‌కు క‌రోనా పాజిటివ్‌!‌


హీరో రామ్‌చ‌ర‌ణ్‌కు క‌రోనా పాజిటివ్‌!‌
హీరో రామ్‌చ‌ర‌ణ్‌కు క‌రోనా పాజిటివ్‌!‌

సామాన్యుఎల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఎవ్వ‌రినీ క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ద‌ల‌డం లేదు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా క‌రోనా బారిన ప‌డుతూనే వున్నారు. తాజాగా స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ క‌రోనా బారిన ప‌డ్డారు. త‌న‌కు క‌రోనా సోకిన విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక వెల్ల‌డించారు. అయితే త‌న‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని అయినా త‌న‌కు పాజిటివ్ అని తేలింద‌ని వివ‌రించారు.

`నేను క‌రోనా బారిన ప‌డ్డాను. తాజాగా చేసిన టెస్టుల్లో క‌రోనా పాజిటివ్ అని తేలింది. అయితే క‌రోనాకి సంబంధించిన ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవు. ప్ర‌స్తుతం హోమ్ క్వారెంటైన్‌లో వున్నాను. గ‌త రెండు రోజులుగా న‌న్ను క‌లిసిన వాళ్లు, నాతో స‌న్నిహితంగా వున్న వాళ్లు కోవిడ్ టెస్ట్ చేయించుకోగ‌ల‌రు. నా రిక‌వ‌రికి సంబంధించిన వివ‌రాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేస్తాను` అని ట్విట్ట‌ర్ లో రామ్‌చ‌ర‌ణ్ వెల్ల‌డించారు.  

మెగాప‌వ‌ర్‌స్టార్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇది పూర్త‌యితే గానీ `ఆచార్య‌` సెట్లోకి వెళ్ల‌రు. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ రామ్‌చ‌ర‌ణ్ రాక కోసం ఎదురుచూస్తోంది. ఈ స‌మ‌యంలో ఇలా జ‌ర‌గ‌డంతో ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నార‌ట‌.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)